టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తన నటనతో తెలుగు చిత్రసీమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రం తో తెలుగులో అడుగు పెట్టింది సామ్. కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సమంత సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన అన్ని విషయాలను సామ్ తన అభిమానులతో పంచుకుంటుంది.

Video Advertisement

 

సామ్ తనకి ‘మయోసిటిస్’ అనే వ్యాధి ఉంది అని కూడా సోషల్ మీడియా లో షేర్ చేసుకుంది. అయితే సామ్ తన సహ నటుడు అక్కినేని నాగచైతన్య తో వివాహం జరిగి, విడాకులు ఇచ్చిన తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి..ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమంత. అయితే నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత పై ఎన్నో వార్తలు వచ్చాయి. విడాకులు ఇవ్వడానికి సమంతానే కారణం అని.. విడాకుల తర్వాత 250 కోట్ల భరణం కూడా తీసుకుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి.

 

stop fake news about samantha..!!

అలాగే ఆమె విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్ళికి సిద్దమయ్యారంటూ కూడా వార్తలు వచ్చాయి. తాను భరణం తీసుకున్నాను అని వస్తున్న వార్తలపై సామ్ ఒక షో లో మాట్లాడుతూ..” ఎవరైనా ఇన్కమ్ టాక్స్ అధికారులు నా ఇంటికి వచ్చి.. నేను ఎలాంటి భరణం తీసుకోలేదు అని ప్రూవ్ చేస్తే బావుండు..” అని అన్నారు.. . అంటే అవి ఎంత ఫేక్ వార్తలో అర్థం అవుతోంది. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సామ్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తర్వాత సమంత తనకు ‘మయోసిటిస్’ అనే వ్యాధి ఉంది అని ప్రకటించింది. దానికి సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది.stop fake news about samantha..!!

 

అయితే ఈ విషయం పై కూడా ఎన్నో వార్తలు రాసుకొచ్చారు. ఫలితం గా యశోద చిత్ర ప్రమోషన్స్ లో సమంత ఈ ఫేక్ న్యూస్ పై స్పందిస్తూ.. ” నాకు ప్రాణాంతక మైన వ్యాధి వచ్చింది, త్వరలో చనిపోబోతున్నాను అని చాలా ఆర్టికల్స్ రాసారు. కానీ నా ఆరోగ్యం ప్రస్తుతం కొంచెం డిఫికల్ట్ గానే ఉంది కానీ నేను ఇంకా చనిపోలేదు..” అని చెప్తూ సామ్ ఎమోషనల్ అయ్యారు. సమంత స్వయం గా చెప్పినా కూడా ఆమె ఆరోగ్యం పై ఫేక్ న్యూస్ లు రావడం ఆగలేదు.

stop fake news about samantha..!!

 

అయితే సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ.. సోషల్ మీడియా కి దూరం గా ఉన్నారు. ఈ క్రమం లో సమంత తన వ్యాధి చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లారని, పలు బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగిస్తున్నారని, సామ్ ఇంక సినిమాలు మానేస్తున్నారని ఫేక్ న్యూస్ లు రావడం తో సమంత మేనేజర్ అవన్నీ నిజం కాదని వెల్లడించారు. ఆమె తన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని.. ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యొద్దని సమంత సిబ్బంది, ఆమె ఫాన్స్ కోరుతున్నారు.