Ads
ఫాల్గుణ మాసం చతుర్ధశి తిథి కృష్ణ పక్షం నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చింది. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. ఈ రోజున అర్థరాత్రి శివుడికి పూజలు చేస్తారు. ఆవుపాలు, ఆవు పాలతో తయారైనపెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనే పంచామృతాల తోనూ, చెరకు రసంతోనూ శివ లింగాన్ని అభిషేకించాలి. ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శివుడికి చేసే పూజ, అభిషేకాలన్నీ ఓంకారాన్ని జపిస్తూ చెయ్యాలి. ఈ పదార్థాలే కాక ఇంకా ఒక్కో కామ్య సిద్ధికి ఒక్కో పదార్థంతో అభిషేక నివేదనలున్నట్టు శివ, లింగ పురాణాలు పేర్కొంటున్నాయి.
Video Advertisement
అయితే శివరాత్రికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ఆ కథలను ఇప్పుడు తెలుసుకుందాం..
#1 నీలకంఠుడు
పురాణాల ప్రకారం క్షీర సాగర మథనం జరిగినపుడు విషం ఆవిర్భవించింది. ఆ సమయం లో దాని ప్రభావంటి తో లోకం మొత్తం ఇబ్బంది పడింది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని స్వీకరించి గొంతులో నిలుపుకున్నాడు. అందుకే శివుడ్ని నీలకంఠుడు, గరళా కంఠుడు అంటారు. ఈ సందర్భంగా శివ రాత్రి పర్వదినాన్ని జరుపుకుంటామని కొందరి నమ్మకం.
#2 బ్రహ్మ – విష్ణు సంవాదం
పురాణాల్లో ఇదే రోజు బ్రహ్మ – విష్ణు ఆధిపత్యం కోసం గొడవ పడ్డారట. ఇది శివునికి కోపం తెప్పించింది. దీంతో వారిద్దరికీ తన మొదలుని తెలుసుకోమని పోటీ పెట్టాడట. ఆ రోజు కూడా మహా శివ రాత్రే.
#3 శివ – శక్తి వివాహం
మహాశివరాత్రి పండుగకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పురాణాలలో శివుడు మరియు శక్తి వివాహానికి సంబంధించిన పురాణం ఒకటి. ఈ కథలో శివుడు తన భార్య అయిన శక్తిని రెండవసారి ఎలా వివాహం చేసుకున్నాడో తెలుపుతుంది. శివుడు, శక్తి పురాణాల ప్రకారం, శివుడు పార్వతిని వివాహం చేసుకున్న రోజును శివరాత్రిగా జరుపుకుంటారు.
#4 బిల్వ పత్రాలు
శివరాత్రి రోజున ఒక వేటగాడిని సింహం వెంబడించింది. సింహం దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి వేటగాడు బిల్వ చెట్టు ఎక్కాడు. సింహం ఆ చెట్టు కింద రాత్రంతా ఎదురుచూసింది. వేటగాడు చెట్టు మీద నుండి పడిపోకుండా మెలకువగా ఉండేందుకు బిల్వ వృక్షం ఆకులను కోసి క్రింద పడేస్తూనే ఉన్నాడు.
చెట్టు కింద ఉన్న శివలింగంపై ఆ ఆకులు పడ్డాయి. బిల్వ పత్రాలు సమర్పించినందుకు సంతోషించిన శివుడు, పక్షులను చంపి వేటగాడు చేసిన పాపం ఎంత చేసినా వేటగాడిని రక్షించాడు. ఈ కథ శివరాత్రి నాడు బిల్వ పత్రాలతో శివుని పూజించడం వల్ల కలిగే శుభాన్ని తెలియజేస్తుంది.
#5 శివ లింగోద్భవం
పురాణాల ప్రకారం బ్రహ్మకి, విష్ణువుకి సంవాదం జరిగినపుడు శివుడు వారికి తన ఆది, అంతం కనుగొనమని చెబుతాడు. బ్రహ్మ, విష్ణువుకి సమాధానం దొరకదు. అయితే అప్పుడు ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం రోజులలో 14వ రోజున, శివుడు మొదట లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అప్పటి నుండి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
End of Article