Ads
ఆపిల్ సంస్థ లోగో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఆపిల్ని ఒక వైపు కొంచెం కొరికినట్టు ఉంటుంది ఆ లోగో. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ లోగో అలా ఎందుకు ఉంటుంది అని? అలా కొరికిన ఆపిల్ బదులు మామూలుగా ఉన్న ఆపిల్ ని లోగో గా పెట్టొచ్చు కదా ? అని ఎప్పుడైనా అనిపించిందా? ఆపిల్ సంస్థ టెక్నాలజీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
Video Advertisement
ఆపిల్ సంస్థ వస్తువులు ఎంత పాపులర్ అయ్యాయో ఆపిల్ లోగో కూడా అంతే పాపులర్ అయింది. ప్రపంచంలో ఎవరైనా ఆపిల్ లోగో చూసి అది ఆపిల్ కంపెనీ కి చెందిన వస్తువు అని గుర్తిస్తారు. ఆ లోగో ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అలా కట్ చేసి ఎందుకు ఉంటుంది? ఇది తెలుసుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే.
అసలు ముందు రూపొందించిన యాపిల్ లోగో ఇది కాదు. 1976లో ఆపిల్ సంస్థ తమ మొదటి ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. అప్పుడు ఆపిల్ లోగో ఐసాక్ న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉన్నట్టు గా ఒక పెయింటింగ్ రూపంలో ఉండేది. దాని కింద ఆపిల్ కంప్యూటర్ కో అని రాసి ఉండేది. ఆ పెయింటింగ్ చూడడానికి బాగున్నా కానీ ఒక డిజిటల్ సంస్థ లోగో లాగా అనిపించలేదు.
ఆ లోగోను డిజైన్ చేసింది రాన్ వెయిన్. రాన్ ఆపిల్ కంపెనీకి మూడవ కో ఫౌండర్. కానీ స్టీవ్ జాబ్స్ కి ఆ లోగో నచ్చలేదు. ఆపిల్ వస్తువులు అనుకున్నంతగా అమ్ముడు అవ్వకపోవడానికి కారణం ఆ లోగో నే అని అనుకున్నాడు. ఆ లోగో కంపెనీకి సూట్ అవ్వలేదు. అదే కాకుండా ఏదైనా చిన్న వస్తువు మీద అంత పెద్ద డిజైన్ వేయడం కూడా కష్టమే. అందుకే లోగో ని మారుద్దామని నిర్ణయించుకున్నారు.
రీజెస్ మెక్ కన్నా అడ్వర్టైజింగ్ కి ఆర్ట్ డైరెక్టర్ అయిన రాబ్ జానోఫ్ ని ఆపిల్ కి కొత్త లోగో తయారు చేయడానికి నియమించారు. తర్వాత లాంచ్ చేయబోయే ఆపిల్ టు మీద కొత్త లోగో ఉండాలి అని స్టీవ్ జాబ్స్ ఆలోచన. రాబ్ ముందు ఒక నల్లటి రంగులో ఉన్న ఆపిల్ ని లోగో గా గీశారు. కానీ అది మరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఏదో తగ్గినట్టు అనిపించింది. అప్పుడు రాబ్ కి మొదటి ఆపిల్ (ఆపిల్ వన్) పరికరాల కోసం మార్కెట్లో అమ్మడానికి వాడిన ఒక ట్యాగ్ లైన్ గుర్తొచ్చింది.
బైట్ ది ఆపిల్ …..$666.66** (Byte the apple). ఇందులో ఉన్న బైట్ అన్న పదాన్ని చూస్తే కొత్త ఆలోచన వచ్చింది. ఇంగ్లీషులో ఈ Byte అంటే డిజిటల్ గా మెమరీ కొలిచేందుకు వాడే ఒక పరిమాణం. Bite అంటే కొరకడం అని అర్థం. కానీ రెండు పదాలు ఒకే లాగ పలుకుతారు. దాంతో రాబ్ కి ఆ byte ని చూస్తే ఈ bite గుర్తొచ్చింది.అలా ఆపిల్ లోగో ని తయారు చేశారు.
దీనికి ఇంకొక కథ కూడా ఉంది అని రాబ్ చెప్పారు. మామూలుగా కొంతమందికి ఆపిల్, చెర్రీ లకి తేడా అర్థం కాదు. దాంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే అలా కొంచెం కట్ చేసినట్టు ఉండడం వలన జనాలకి అది ఆపిల్ లానే కనిపిస్తుంది అని అన్నారు.
లోగో తయారీలో రాబ్ కి అసిస్టెంట్ గా చేసిన బిల్ కెల్లీ మాత్రం కారణం కొంచెం వేరేగా చెప్పారు. ఈ లోగో బైబిల్ లో వున్న ఆడమ్ అండ్ ఈవ్ కథను స్ఫూర్తిగా తీసుకొని తయారు చేసిందని చెప్పారు. కారణం ఏదైనా కానీ స్టీవ్ జాబ్స్ కి ఈ లోగో చాలా నచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే లోగో ని ఉంచారు.ఇది ఆపిల్ లోగో వెనకాల ఉన్న కథ.
End of Article