ఈ 10 మంది క్రికెటర్ల “జెర్సీ నంబర్ల” సీక్రెట్ లు మీకు తెలుసా.? ఆ నెంబర్ నే ఎందుకు పెట్టుకున్నారు అంటే.?

ఈ 10 మంది క్రికెటర్ల “జెర్సీ నంబర్ల” సీక్రెట్ లు మీకు తెలుసా.? ఆ నెంబర్ నే ఎందుకు పెట్టుకున్నారు అంటే.?

by Mohana Priya

Ads

క్రికెట్ లేదా వేరే స్పోర్ట్ లో ప్లేయర్ వెనక్కి తిరిగి నించొని ఉంటే వాళ్ళు ఎవరో గుర్తుపట్టడానికి జెర్సీ మీద ఉన్న పేరు చూస్తాం. ఒకవేళ అది కూడా క్లియర్ గా కనిపించకపోతే ప్లేయర్ ని గుర్తుపట్టడానికి చూసేది జెర్సీ నెంబర్. క్రికెట్ విషయానికి వస్తే 1999లో జరిగిన వరల్డ్ కప్ లో మొదటి సారిగా జెర్సీ నెంబర్స్ ని అసైన్ చేశారు.

Video Advertisement

కెప్టెన్ 1 నంబర్ ఉన్న జెర్సీ వేసుకున్నారు. మిగిలిన ప్లేయర్లు 2- 15 నంబర్స్ ఉన్న జెర్సీలను ధరించారు. అలా కొంత మంది క్రికెటర్ జెర్సీ వెనకాల ఉన్న నంబర్ కి కూడా కథ ఉంది. వాళ్ళు ఎవరో, వాళ్ళ జెర్సీ నెంబర్ వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 మహేంద్రసింగ్ ధోని

భారతదేశంలో సక్సెస్ ఫుల్ కెప్టెన్ అవ్వడానికి ముందు ధోని గోల్ కీపర్. ధోనీ జెర్సీ నెంబర్ 7. ధోని తన అభిమాన ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ యునైటెడ్ నుండి ఇన్స్పైర్ అయ్యారు. జార్జ్ బెస్ట్ నుండి ఎరిక్ కాంటోనా తర్వాత క్రిస్టియానో రొనాల్డో ఈ నెంబర్ జెర్సీ ధరించారు. కానీ ధోని జెర్సీ నెంబర్ 7 అవ్వడానికి ముఖ్య కారణం ధోని పుట్టిన రోజు జూలై 7. ధోని ఒక జ్యోతిష్కుడిని సంప్రదించగా ఆయన 7 అనేది న్యూట్రల్ నెంబర్ అని, దానికి పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ లేదు అని చెప్పారు.

#2 విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ తండ్రి 18 డిసెంబర్ 2006 న తనకి (విరాట్ కోహ్లీకి) 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరణించారు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. తన కొడుకు ఇండియా తరపున ఆడటం చూడాలి అని విరాట్ కోహ్లీ తండ్రి కల కన్నారు. కానీ విరాట్ కోహ్లీ భారతదేశం తరపున ఆడటం ఆయన చూడలేకపోయారు. అండర్ -19 లో ఉన్నప్పుడే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 ఉండేది. తర్వాత కూడా అదే నంబర్ కొనసాగుతోంది.

#3 యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ 12 నెంబర్ ఉన్న జెర్సీ ని ధరిస్తారు. యువరాజ్ సింగ్ 12వ నెల అంటే డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. ఇంకొక విషయం ఏంటంటే యువరాజ్ సింగ్ పంజాబ్, హర్యానా క్యాపిటల్ అయిన చండీగఢ్ లో సెక్టార్ 12 లో జన్మించారు.

#4 రోహిత్ శర్మ

రోహిత్ శర్మ కి తన అదృష్ట సంఖ్య 9 అని సూచించారు. కానీ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోవడానికి సుముఖత చూపలేదు. దాంతో ప్రపంచ కప్‌లో ఇండియా అండర్ -19 తరపున ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ తల్లి 45 నెంబర్ సెలెక్ట్ చేశారు.

#5 అజింక్య రహానే

అజింక్య రహానే అదృష్ట సంఖ్య 9. అందుకే 9 సంఖ్య వచ్చేలా 27 నంబర్ (2+7=9) జెర్సీని ధరిస్తారు.

#6 రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా లక్కీ నెంబర్ 12. ఈ నెంబర్ జెర్సీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినప్పుడు ధరించారు రవీంద్ర జడేజా. కానీ టీమిండియా తరపున కాదు. ఎందుకంటే యువరాజ్ సింగ్ 12 నెంబర్ ధరించారు. రవీంద్ర జడేజా నెంబర్ 8 జెర్సీ ధరిస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే రవీంద్ర జడేజా పుట్టిన తేదీ 6/12/1988. ఈ నంబర్స్ అన్నిటినీ కలిపితే (6 + 12 + 1 + 9 + 8 + 8 = 44, 4 + 4 = 8) 8 వస్తుంది.

#7 శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ తన భార్య పుట్టినరోజు 22 వ తేదీ, మరియు తన కూతురి పుట్టినరోజు 25 వ తేదీలను పరిగణలోకి తీసుకొని ఫ్యామిలీ నెంబర్ గా కన్సిడర్ చేసి 25 నంబర్ ఉన్న జెర్సీ ధరిస్తారు.

#8 హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా, 2016లో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు 228 నంబర్ జెర్సీ ధరించారు. బిసిసిఐ నిర్వహించిన అండర్ -16 టోర్నమెంట్ లో ఇది తన హైయెస్ట్ స్కోర్.

#9 హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్ పుట్టిన తేదీ జూలై 3. అందుకే హర్భజన్ సింగ్ తన జెర్సీ నెంబర్ 3 గా ఎంచుకున్నారు.

#10 రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ జెర్సీ నంబర్ 99. అశ్విన్ కి ఇష్టమైన నెంబర్ 9. స్కూల్ లో తన రోల్ నెంబర్ కూడా 9 ఉండేది.


End of Article

You may also like