Ads
యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్‌ఆర్‌ఆర్). బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Video Advertisement
అలాగే రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకుడిని సంతృప్తి పరచడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందువల్లే బాహుబలి కోసం ఐదేళ్లు పట్టింది. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా కోసం శ్రమించాడు జక్కన్న. ఆయన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపించింది.
సినిమాలో గవర్నర్ స్కాట్ ఓ సారి ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. అక్కడ గోండు జాతికి చెందిన బాలిక మల్లిని తమతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడు. తమ బిడ్డని తీసుకెళ్లొద్దని అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడి చేయిస్తాడు. ఇది అన్యాయం అని భావించిన గోండు జాతి బిడ్డ భీమ్ (ఎన్టీఆర్).. ఎలాగైన మల్లిని తిరిగి ఎలాగైన మల్లిని తిరిగి తీసుకురావాలని భావిస్తాడు.
తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వెళ్తాడు. పకడ్బందీ బందోబస్తు ఉన్న బ్రిటీష్ కోటలోకి ఓ వేడుక జరుగుతున్న టైంలో భీమ్ కొన్ని క్రూర మృగాలతో కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ జంతువులు వేడుకను డిస్టర్బ్ చేయడంతో పాటు అక్కడున్న వారంతా జంతువులను చూసి భయపడిపోతారు. అయితే ఈ సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని అలాంటి చోటికి మీరు జంతువులను ఎలా తీసుకెళ్తారు అని ప్రశ్నించగా..
దానికి సమాధానంగా రాజమౌళి “నాకు క్రేజీ ఐడియాలు అంటే ఇష్టం. అది భీమ్ పాత్రపై పని చేసింది. భీమ్ అడవిలో నివసించే గిరిజనుడు కావడంతో, జంతువులతో అతనికి సాన్నిహిత్యం ఉంటుంది. ఇప్పుడు అతను తన బలం లేని ప్రదేశానికి వెళ్తున్నాడు. కాబట్టి అతను తన బలాన్ని పెంచుకోవాలి అనుకుంటాడు” అని నేను ఆలోచించడం ద్వారా ఆ సీన్ సాధ్యం అయిందని దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు.
End of Article