Ads
తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. 295 చిత్రాల్లో ఆయన పోషించని పాత్రంటూ లేదు.
Video Advertisement
ప్రతి పాత్రకు తన నటనతో ప్రాణం పోసిన నట దిగ్గజం ఎన్టీఆర్. ఆయన వారసుడిగా బాలకృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో నరసింహ నాయుడు సినిమా ఒకటి.
ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. “కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో “మేం గట్టిగా కన్నెర్ర చేస్తే.. గుండె ఆగి చస్తారు” అని చెప్పగా.. ఆ మాటల స్పూర్తితో పరుచూరి బ్రదర్స్ ఈ డైలాగ్ ను రాశారు. అలా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను బాలయ్య చెప్పడం నరసింహ నాయుడు సినిమా సంచలన విజయం సాధించింది.
watch video:
బాలకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో నరసింహ నాయుడు ఒకటిగా నిలిచింది. 2001 లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాకు పోటీగా ఇతర స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా.. ఆ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించలేదు. నరసింహ నాయుడు సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది.
గత సంవత్సరం వచ్చిన బాలయ్య అఖండ మూవీ.. అఖండ విజయం సాధించగా, ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్బీకే 108 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.
End of Article