ఆరెంజ్ మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ మూవీ రీరిలీజ్‌లో మాత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పేరు పెట్టారో  తెలిపారు.

Video Advertisement

2010లో రిలీజ్ అయిన ‘ఆరెంజ్’ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. నిర్మాతకు కొలుకోలేనంత నష్టాలను మిగిల్చింది. అయితే టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు, ఇటీవల రీరిలీజ్ సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అట్టర్ ఫ్లాప్‌ అయిన ఈ సినిమా రీరిలీజ్‌ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఈ మూవీ చూసిన చాలామంది ఆడియెన్స్ ఈ సినిమా ‘ఆరెంజ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఈ సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయం ఎవరికి తెలియదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం ఇలా చెప్పుకొచ్చారు. “చిత్రం థీమ్‌ ప్రకారం మూవీ టైటిల్‌ను సెలెక్ట్ చేశాను. ప్రేమ అనేది కొన్ని రోజుల తర్వాత తగ్గుతుంది. అప్పుడు వేరొక వ్యక్తిని లవ్ చేయమని చెప్పడమే ఆరెెంజ్ మూవీ థీమ్. ఒకరి పట్ల ప్రేమ అనేది ఎల్లపుడూ ఒకేలా ఉండదు.
ఆ బంధంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. వీటినే సూర్యోదయం మరియు సూర్యాస్తమయంతో పోల్చాం. సూర్యూడు సన్ రైజ్, సన్ సెట్‌ లలో ఆరెంజ్ రంగులో కనిపిస్తాడు. సన్ రైజ్ ప్రేమ మొదలవడాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో సూర్యూడు ప్రకాశవంతంగా ఉంటాడు. అలానే సన్ సెట్‌ లవ్ ముగింపుకు సూచన. అందువల్ల మా  సినిమాకి ‘ఆరెంజ్’ అనే టైటిల్‌ పెట్టాం. మూవీ యూనిట్ అంతా టైటిల్‌ ఓకే చెప్పారు.” అని బొమ్మరిల్లు భాస్కర్ వెల్లడించారు.
ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నాగబాబు నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ గా జెనీలియా నటించింది.  ఒక మంచి ప్రేమ కథగా పేరు తెచ్చుకున్నా అప్పటి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటి జనరేషన్‌కు మాత్రం ఈ మూవీ చాలా కనెక్ట్ అయింది. మొదటిసారి రిలీజ్ అయినపుడు డిజాస్టర్ అనిపించుకున్న ఈ చిత్రం అందరు ఆశ్చర్యపోయేలా రీరిలీజ్‌లో హిట్ అయ్యింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.

watch video :

 

Also Read: VIRUPAKSHA REVIEW : “సాయి ధరమ్ తేజ్” నటించిన విరూపాక్ష హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!