స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా “గార్గి”. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు.
తమిళ్ లో స్టార్ హీరో సూర్య మరియు తెలుగులో రానా దగ్గుబాటి ఈ సినిమాని సమర్పించారు.
Video Advertisement
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే తెచ్చుకుంది.
అయితే సినిమా ప్రెసెంటేషన్, కథ, కథనం వేరు. సినిమాకు పేరు పెట్టడం వేరు. అది దర్శక నిర్మాతల అవగాహన, అధ్యయనానికి అద్దం పడుతుంది. అసలు టైటిల్ చూడగానే సినిమా జోనర్ ఏంటో తెలిసేలా ఉండాలి. అలాంటిదే సాయి పల్లవి నటించిన ‘గార్గి’ చిత్రం.
అసలు గార్గి అంటే ఎవరు..? ఆ పేరు కి అర్థం ఏంటి..?? అనేవి ఇప్పడు చూద్దాం. గార్గి అనే పేరు మనకు పురాణాల్లో కనిపిస్తుంది. గార్గా మహర్షి వంశీయుల్లో వాచక్ను అనే మహర్షి కుమార్తె పేరు గార్గి. ఆమెను గార్గి వాచక్నవి అని పిలుస్తారు
మహిళలకు పురాణం పఠనం, వేద పఠనం నిషిద్దమైన రోజుల్లో ఈమె అన్ని వేదాలను, ఉపనిషత్తులను అవపోశన పట్టేది. ఈమెను వేద సాహిత్యంలో గొప్ప సహజ తత్వవేత్తగా గౌరవిస్తారు.బ్రహ్మ విద్యా జ్ఞానం ఉన్న వ్యక్తి విదేహ రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మయజ్ఞంలో ఆమె ఆత్మ సమస్యపై గందరగోళ ప్రశ్నలతో యాజ్ఞవల్క్య ఋషిని సవాలు చేసింది.
ఆమె ఋగ్వేదంలో అనేక శ్లోకాలను వ్రాసినట్లు కూడా చెబుతారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయింది. చిన్నప్పటి నుండి ఆమె వేద గ్రంధాల పట్ల అమితమైన ఆసక్తిని కనబరిచింది. మరియు తత్వశాస్త్ర రంగాలలో చాలా ప్రావీణ్యం సంపాదించింది. ఆమె వేద కాలంలో వేదాలు మరియు ఉపనిషత్తులలో అత్యంత జ్ఞానాన్ని పొందింది. ఇతర తత్వవేత్తలతో మేధో చర్చలు నిర్వహించింది.
‘గార్గి’ చిత్రంలోని కథానాయికది ఇలాంటి పాత్రే. జీవిత సారాన్ని అర్థం చేసుకుంటూ, నిరంతరం తనని తాను మధించుకుంటూ, నిజం వైపు ప్రయాణిస్తూ..ఓడిపోతూ, గెలుస్తూ, న్యాయం వైపు నిలబడే పాత్ర. అందుకే గార్గి చిత్ర దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ఈ పేరును ఎంచుకున్నారు.