మనం ఎంతో ఇష్టపడి తినే KFC చికెన్ వెనక ఓ వ్యక్తి నలభైయ్యేళ్ళ ఓటమి దాగుందని మీకు తెలుసా..? నమ్మలేకపోతున్నా ఇది నిజం. ప్రయత్నిస్తూ ఉంటె కచ్చితం గా విజయం మన తలుపు తడుతుంది అనడానికి అతనే ఉదాహరణ. మీకెప్పుడైనా మీ లైఫ్ లో ఓటమి ఎదురై నిరాశగా అనిపించిందా..? అయితే, ఈ స్టోరీ చదివి చూడండి. ఎన్ని సార్లు ఓడినా, తిరిగి పోరాడాలన్న స్ఫూర్తి లభిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు. KFC ఫౌండర్ కలోనేల్ సాండర్స్.

kfc founder 1

హర్లాండ్ డేవిడ్ సాండర్స్ చిన్న తనం నుంచి పని చేసి సంపాదించాల్సిన అవసరం వచ్చింది. హర్లాండ్ డేవిడ్ సాండర్స్ సెప్టెంబర్ 9, 1890 న ఇండియానాలోని హెన్రీవిల్లేలో జన్మించారు. తన తండ్రి 6 సంవత్సరాల వయస్సులో మరణించిన తరువాత, సాండర్స్ తన తమ్ముడు మరియు సోదరిని పోషించడం కోసం బాధ్యత వహించాల్సి వచ్చింది. అంత చిన్న వయసులోనే అనేక రకాల పనులు చేసేవాడు. రైతు, స్ట్రీట్ కార్ కండక్టర్, రైల్‌రోడ్ ఫైర్‌మాన్ మరియు ఇన్సూరెన్స్ సేల్స్ మాన్ తో సహా పలు చోట్ల పని చేసాడు.

kfc founder 2

కానీ, అన్ని చోట అతను పని నుంచి రిజెక్ట్ చేయబడ్డాడు. ప్రతి పనిలోనూ ఓటమిని ఎదుర్కొన్నాడు. అలా నలభై సంవత్సరాల వరకు సాండర్స్ ఎదో ఒక పని వెతుక్కుంటూ చేసుకుంటూనే ఉన్నాడు. అతనికి నలభై ఏళ్ళు వచ్చాక, కెంటుకీలో ఒక సేవా స్టేషన్ నడపడం స్టార్ట్ చేసాడు. ఎవరైనా ఆకలితో వస్తే, వారికి కడుపునిండా పెట్టి ఆకలి తీర్చేవాడు. ఆ తరువాత దానిని ఒక రెస్టారెంట్ లాగ డెవెలప్ చేసి అందరికి ఫ్రైడ్ చికెన్ ను అందించడం మొదలుపెట్టాడు.

kfc founder 3

ఇది సాండర్స్ ని బాగా పాపులర్ చేసింది. 1935 లో గవర్నర్ రూబీ లాఫూన్ హర్లాండ్ డేవిడ్ సాండర్స్ ని కెంటుకీ కల్నల్ అంటూ పిలిచి గౌరవించారు. అప్పటినుంచి అందరు ఆయన్ను కెంటుకీ కల్నల్ అనే పిలుస్తున్నారు. 1952 లో, సాండర్స్ తన చికెన్ వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ చేయడం ప్రారంభించాడు. అతని మొట్టమొదటి ఫ్రాంచైజ్ అమ్మకం పీట్ హర్మాన్ కు వెళ్ళింది.

kfc founder 4

అతను సాల్ట్ లేక్ సిటీలో ఒక రెస్టారెంట్ నడపడం ప్రారంభించాడు. అక్కడ కూడా “కెంటుకీ ఫ్రైడ్ చికెన్” దక్షిణ ప్రాంతీయ ప్రత్యేకతతో అందరికి ఫేవరెట్ ఫుడ్ అయిపొయింది.. నార్త్ కరోలినాలోని సాండర్స్ సొంత రెస్టారెంట్‌లో కొంత ట్రాఫిక్ తగ్గడం తో 1955 లో ఈ ప్రదేశాన్ని విక్రయించాడు. తరువాత అతను దేశవ్యాప్తంగా ప్రయాణించడం ప్రారంభించాడు. రెస్టారెంట్ నుండి రెస్టారెంట్ వరకు బ్యాచ్ లు గా చికెన్ ను వండటం, ప్రతి చికెన్‌కు ఒక నికెల్ (నార్త్ అమెరికా లో ఐదు సెంట్ల కాయిన్ ను నికెల్ అంటారు) చెల్లించే ఒప్పందాలు చేసుకునేవాడు. 1964 లో, 600 కంటే ఎక్కువ ఫ్రాంచైజ్ అవుట్‌లెట్లతో అతను తన వ్యాపారాన్ని విస్తరించుకోగలిగాడు. ఆ తరువాత తన సంస్థను 2 మిలియన్లకు పెట్టుబడిదారుల సమూహానికి విక్రయించాడు.

kfc 5

కెంటుకీ ఫ్రైడ్ చికెన్ 1966 లో బహిరంగమైంది మరియు 1969 లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితా లో చేరింది. 1971 లో హ్యూబ్లిన్ ఇంక్ KFC కార్పొరేషన్ను 285 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినప్పుడు, KFC సంస్థ కు 3,500 కంటే ఎక్కువ ఫ్రాంచైజ్ మరియు కంపెనీ యాజమాన్యంలోని రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆ తరువాత KFC, R.J. యొక్క అనుబంధ సంస్థగా మారింది. KFC ను అక్టోబర్ 1986 లో RJR (నబిస్కో. ఇంక్) నుండి పెప్సికో ఇంక్., సుమారు 840 మిలియన్ డాలర్ల కు కొనుగోలు చేసింది.

kfc logo

అలా KFC ప్రపంచానికి పరిచయం అయింది. సాండర్స్ తన తరువాతి సంవత్సరాల్లో అంబాసిడర్ ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న KFC రెస్టారెంట్లను సందర్శించేవారు.. అతను కెంటకీలోని లూయిస్విల్లేలో 1980 డిసెంబర్ 16 న తన 90 సంవత్సరాల వయసులో మరణించారు. అలా మొదట్లో అన్ని ఓటములనే చవి చూసిన సాండర్స్ తన నలభయ్యవ ఏట తన జీవిత గమ్యానికి మార్గాన్ని కనుక్కుని, అందులో విజయం సాధించాడు. ఓడిపోయామని కుంగిపోకుండా.. ఆ ఓటమి కి గల కారణాన్ని వెతికి పట్టుకుని తిరిగి విజయం సాధించి నిలబడాలి. అందుకు ఇలాంటి వారి కధలను స్ఫూర్తి గా తీసుకోవాలి.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE