హైదరాబాద్ లోని ఈ 15 ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? వెనకున్న చరిత్ర ఇదే.!

హైదరాబాద్ లోని ఈ 15 ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? వెనకున్న చరిత్ర ఇదే.!

by Mohana Priya

Ads

అసలు తాజ్ మహల్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ కోసం ఒక కట్టడాన్ని నిర్మించాడు. ఆ కట్టడానికి తన భార్య పేరు ని పెట్టాడు. అసలు తాజ్ మహల్ పేరు ముంతాజ్ మహల్. తర్వాత తాజ్ మహల్ గా ప్రసిద్ధి చెందింది. ఇదంతా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ మళ్లీ చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇలా ప్రతి చారిత్రక కట్టడం పేరు వెనుక ఏదైనా కథ, లేదా అర్థం ఉంటుంది. అలా మన హైదరాబాద్ లోని కొన్ని ప్రదేశాల పేర్ల వెనుక ఉన్న కథని తెలుసుకుందాం.

Video Advertisement

#1 బేగంపేట్

ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా  కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం కి  రెండవ అమీర్ షామ్స్ ఉల్ ఉమ్రా అమీర్ ఎ కబీర్ తో వివాహం జరిగినప్పుడు ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చారు. ఆ ప్రదేశానికి బషీర్ ఉన్నిసా బేగం పేరుమీద బేగంపేట్ అనే పేరు వచ్చింది.

#2 చార్మినార్

కులీ కుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటి ఈ నాలుగు స్తంభాలు. కాబట్టి నిర్మాణానికి కూడా నాలుగు స్తంభాలు అని అర్థం వచ్చేలాగా చార్ మినార్ పేరును పెట్టారు. చార్ అంటే 4 మినార్ అంటే స్తంభాలు.

#3 సికింద్రాబాద్

మూడవ నిజాం సికందర్ జాహ్ పేరుతో ఆ ప్రదేశానికి సికింద్రాబాద్ అని పేరు వచ్చింది. అంతకు ముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచేవాళ్ళు. లష్కర్ అంటే కంటోన్మెంట్ అని అర్థం.

#4 ఖైరతాబాద్

ఇబ్రహీం కుతుబ్ షా కుమార్తె ఖైరున్నిసా బేగం పేరు మీద ఆ స్థలాన్ని మంజూరు చేశారు. అందుకే ఆ ప్రదేశానికి ఖైరున్నిసా బేగం పేరు కలిసేటట్టు ఖైరతాబాద్ అని పేరు పెట్టారు.

#5 శంషాబాద్

నిజాం పాలకులు, షమ్స్-ఉల్-ఉమ్రా అనే పైగహ్ నోబుల్ గౌరవార్ధం ఆ ప్రదేశానికి శంషాబాద్ అనే పేరు పెట్టారు. షమ్స్ అంటే అరబిక్ లో సూర్యుడు అని అర్థం.

#6 నాంపల్లి

క్రీస్తు శతాబ్దం 1670 లో రజా అలీ ఖాన్ హైదరాబాద్ కి దివాన్ గా ఉన్నారు. ఆయనకు నేఖ్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నేఖ్ నామ్ ఖాన్ పేరుతో ఒక స్థలం మంజూరు అయింది. స్థలానికి నేఖ్ నామ్ పల్లి అని పేరు పెట్టారు. తర్వాత ఆ పేరు నాంపల్లి అయింది.

#7 హిమాయత్ నగర్

1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ – అజామ్ జా పేరుమీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అనే పేరు వచ్చింది.

#8 సోమాజిగూడ

ఆ ప్రాంతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి అయిన సోనాజీ కి కొన్ని భూములు ఉండేవి. సోనాజీ సోమాజీ అయింది. గూడ అంటే గూడెం లేదా చిన్న గ్రామం (కుగ్రామం) అని అర్థం.

#9 అబిడ్స్

ఆల్బర్ట్ అబిడ్ అనే ఒక అర్మేనియన్ వ్యాపారికి ఆ ప్రాంతంలో ఒక దుకాణం ఉండేది. అందుకే ఆ ప్రదేశాన్ని అబిడ్స్ అని పిలుస్తారు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్ట్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాడు. ఇంకొక కథ ఏంటంటే అబిద్ ఎవాన్స్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో నడిపిన దుకాణం పేరు అబిడ్స్ అని అందువల్లే ఆ ప్రదేశానికి అబిడ్స్ అనే పేరు వచ్చింది అని కూడా అంటారు.

#10 మాసబ్ ట్యాంక్

ఆరవ రాజు కులీ కుతుబ్ షా భార్య హయత్ బక్షి బేగం ను మా సాహెబా అని పిలిచేవారు. మల్లెపల్లి గ్రామ భూములకు సాగునీరు ఇవ్వడానికి ఆమె ఒక ట్యాంక్ నిర్మించింది. ఆ ట్యాంక్ పేరు మా సాహెబా కా తలాబ్ అని పిలిచేవారు. చివరికి ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది.

#11 హైదరాబాద్

కులీ కుతుబ్ షా భార్య భాగమతి వివాహమైన తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైదర్ నగరం అని అర్థం. తర్వాత తన పేరు మీద హైదరాబాద్ అనే పేరు వచ్చింది.

#12 మలక్ పేట్

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకూబ్ పేరుమీద ఆ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.

#13 బషీర్ బాగ్

పైగహ్ నోబుల్ అయిన సర్ అస్మాన్ జా బసిరుద్-దులా కి ఒక పెద్ద ప్యాలెస్ ఉండేది. ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది. బసిరుద్-దులా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అని పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్థం.

#14 ఫలక్ నామా

ఫలక్ అంటే ఆకాశం. నామా అంటే అద్దం. ఆ ప్రదేశం కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది. కాబట్టి ఆకాశానికి అద్దం అని అర్థం వచ్చేలాగా ఫలక్ నామా అని పేరు పెట్టారు.

#15 సరూర్ నగర్

హైదరాబాద్ ప్రధానమంత్రి అరస్తు జా భార్య సురూర్ అఫ్జా బాయి పేరుమీద ఆ ప్రదేశానికి సరూర్ నగర్ అనే పేరు వచ్చింది.


End of Article

You may also like