పురాణాల్లో రాఖీ భర్తకు భార్య కట్టిందని మీకు తెలుసా.? రాఖీ పండుగ చరిత్ర తప్పక తెలుసుకోండి.!

పురాణాల్లో రాఖీ భర్తకు భార్య కట్టిందని మీకు తెలుసా.? రాఖీ పండుగ చరిత్ర తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

భారతదేశంలో ముఖ్యమైన పండుగల్లో రాఖీ ఒకటి. ప్రతి సోదరి తన సోదరుడు బాగుండాలి అని, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఆశిస్తూ రాఖీ పండుగ రోజు రాఖీ కడుతుంది. సోదరుడు కూడా తన సోదరి బాగుండాలి అని కోరుకుంటూ, రాఖీ కట్టినందుకు బహుమతి ఇస్తాడు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయం.

Video Advertisement

పురాణాల నుండి రాఖీ పండుగను జరుపుకునేవారు. కానీ పురాణాల ప్రకారం రాఖీ మొదట ఒక భార్య తన భర్తకు కట్టిందట. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం అయింది. అంత భీకర పోరాటంలో ఓడిపోతానేమో అన్న భయం తో దేవతలకు రాజు అయిన దేవేంద్రుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోతాడు.

దేవేంద్రుడిని చూసిన ఆయన భార్య శచీదేవి ఒక శ్రావణ పౌర్ణమి నాడు శివుడు పార్వతులను, లక్ష్మీ నారాయణులను పూజించి తన భర్త విజయం సాధించాలని దేవేంద్రుడు చేతికి ఒక రక్ష ను కడుతుంది. దీంతో దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తాడు. అలా శచీదేవి ప్రారంభించిన రక్షాబంధనం ఇప్పుడు రాఖీ గా జరుపుకుంటున్నారు అని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పండగ ను జరుపుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో రాఖీ పండుగ ను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొన్ని చోట్ల రాఖీ అని, కొన్ని చోట్ల ఉపకర్మ లేదా అవని అవిత్తం అని, కొన్ని చోట్ల రక్షాబంధన్ అని, మరికొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణిమ అని, ఛత్తీస్ గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కజరీ పూర్ణిమ అని, పవిత్రోపాన, గుజరాత్, గోవా, మహారాష్ట్ర ప్రాంతాల్లో నరాలీ పూర్ణిమ, లేదా నారియల్ పూర్ణిమ అని పిలుస్తారు.


End of Article

You may also like