“ముందు కూర్చుంటే స్నాక్స్ దొరకలేదు అని వెనుక వరుసలో కూర్చున్నా..చివరికి?” పెళ్లిలో ఎదురైనా సంఘటన.!

“ముందు కూర్చుంటే స్నాక్స్ దొరకలేదు అని వెనుక వరుసలో కూర్చున్నా..చివరికి?” పెళ్లిలో ఎదురైనా సంఘటన.!

by Mohana Priya

Ads

చాలా మందికి ఓర్పు చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఒక చోట వారికి అనుకున్న పని అవ్వకపోతే తర్వాత ఆ చోటు నుండి మారిపోదామని ప్రయత్నిస్తారు. కానీ అలా మారిన తర్వాత కూడా ఒకసారి పనులు సరిగ్గా అవ్వవు. వారు అనుకున్న ఫలితం పొందలేరు. అందుకు ఇప్పుడు మీరు చదవబోయే సంఘటన ఒక ఉదాహరణ.

Video Advertisement

Story of a man who attended a wedding

representative image

తనకు జరిగిన ఈ సంఘటనని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కథ ఏంటో వ్యక్తి మాటల్లోనే విందాం. “నేను ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను. లాక్ డౌన్ సడలింపులు తర్వాత జరుగుతున్న పెళ్లి కావడంతో జనాలు బానే వచ్చారు. నాకసలు ఇలా పెళ్లిళ్లకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అని ఫార్మాలిటీకి అయినా వెళ్లాలి అని చెప్పడంతో వెళ్లాల్సి వచ్చింది.

Story of a man who attended a wedding

representative image

ఇప్పుడు బయట పరిస్థితులు సరిగా లేవు కాబట్టి అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టాలి అని అనిపించలేదు. దాంతో నేనే వెళ్ళి వాళ్లకి గిఫ్ట్ ఇచ్చి వచ్చేస్తాను అని, ఇంట్లో వాళ్ళు ఎవరిని వద్దు అని చెప్పాను. నేను మొదటి వరుసలో కూర్చున్నాను. అక్కడ ఎవరూ తెలియదు కాబట్టి కొంచెం సేపు పరిసరాల్ని గమనించి, తర్వాత ఫోన్ లో లీనమైపోయాను. అప్పుడు నా పక్క నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది.

Story of a man who attended a wedding

representative image

ఆ అమ్మాయి చేతిలో స్నాక్స్ ఉన్నాయి. అమ్మాయి వెనకాల వరుస నుంచి ముందుకి స్నాక్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. నా వరకు వచ్చేటప్పటికి స్నాక్స్ అయిపోయాయి. మధ్యాహ్నం అవ్వడంతో బాగా ఆకలేస్తోంది. భోజనం చేద్దామని చూస్తే అక్కడ కూడా జనాలు చాలా మంది ఉండటంతో నేను ఆగాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అమ్మాయి చేతిలో కూల్ డ్రింక్స్ ఉన్నాయి.

representative image

ఎలాగో ఆమె వెనక వరుస నుండి సర్వ్ చేస్తూ వస్తుంది అని నేను వెళ్ళి వెనక వరుసలో కూర్చున్నాను. కానీ ఈ సారి ఆ అమ్మాయి ముందు వరుస నుండి కూల్ డ్రింక్స్ ఇస్తూ వచ్చింది. మళ్ళీ ఇందాకటిలాగానే నా వరకు వచ్చేటప్పటికి కూల్ డ్రింక్స్ అయిపోయాయి. భోజనాల దగ్గర ఏమో జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు. నాకేమో అలా అంత మంది ఉన్నప్పుడు తినడం అంత పెద్దగా ఇష్టం లేదు.

Story of a man who attended a wedding

representative image

ఇంక ఇలా కాదు అని చెప్పి ఈ సారి ఈ మధ్య వరుసలో కూర్చున్నాను. ఈ సారి ఇద్దరు అమ్మాయిలు రెండు పెద్ద బౌల్స్ తో వచ్చారు. బౌల్స్ పెద్దగా ఉండటంతో లోపల ఏముందో కనిపించడం లేదు. అయితే వారిద్దరూ ఒకరు వెనకాల వరుస నుండి ఒకరు ముందు వరుస నుండి సర్వ్ చేయడం మొదలుపెట్టారు. వారిలో వెనకాల నుండి సర్వ్ చేసే అమ్మాయి నా దగ్గరికి బౌల్ ని తీసుకువచ్చింది.

Story of a man who attended a wedding

representative image

హమ్మయ్య ఈ సారైనా బౌల్ నా వరకు వచ్చింది అని ఆ బౌల్ లో చెయ్యి పెట్టాను. చూస్తే అందులో ఉన్నవి టూత్ పిక్స్. నేను ముందు కూర్చున్న చోటే కూర్చుని ఉంటే ఈ పాటికి నేను కనీసం కూల్ డ్రింక్స్ అయినా తాగేవాడిని అని అనిపించింది. ఊరికే అనవసరంగా నేనే చోట్లు మారాను. అప్పుడే అర్థమైంది ఊరికే చోటు మార్చడానికి ప్రయత్నించవద్దు మన ఎక్కడ ఉన్నా మనకు ఏదైనా దక్కాలి అని ఉంటే కచ్చితంగా దక్కుతుంది” అని చెప్పారు.


End of Article

You may also like