‘కార్తికేయ-2’ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అవడంతో నిఖిల్‌ సిద్దార్థకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ దూసుకెళ్తున్నాడు. అతడి లైనప్ కూడా మామలుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒకదాని తరువాత మరొకటి లైన్ లో పెట్టాడు. 

Video Advertisement

ఆ చిత్రాల నిఖిల్, కాన్వాస్, మార్కెట్ వేరే లెవెల్ లో కనిపించేలా ఉన్నాయి. ఇటీవల రిలీజైన ‘స్పై’ టీజర్ వేరే రేంజ్ సినిమాలా కనిపించింది. ఆ తరువాత వచ్చిన ‘ది ఇండియా హౌస్’ కూడా భారీ సినిమానే. ఇక నిఖిల్ పుట్టినరోజున ప్రకటించిన ‘స్వయంభు’ పోస్టర్ లో నిఖిల్ వీరుడి కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. మరి దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజున కొత్త ఇంకా పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ ‘స్వయంభు’ ప్రకటన. ఈ పోస్టర్ నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీ చారిత్రక సాగే స్టోరీ అని తెలుస్తోంది. భరత్ కృష్ణమాచారి అనే కొత్త డైరెక్టర్ ‘స్వయంభు’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
భరత్ కోలీవుడ్ రచయిత, దర్శకుడిగా అతనికి స్వయంభు మొదటి చిత్రం. అతను కోలీవుడ్ లో కొన్ని చిత్రాలకు రచయితగా పని చేశాడు. అయితే భరత్ కృష్ణమాచారి చోళుల బ్యాక్ డ్రాప్‌లో ఒక ఇంట్రెస్టింగ్ వారియర్ కథను సిద్ధం చేసుకుని ప్రొడ్యూసర్ ఠాగూర్ మధుకు వినిపించాడు. మధు దగ్గర ఆల్రెడీ హీరో నిఖిల్ డేట్లు ఉన్నా, కార్తికేయ-2తో వచ్చిన ఇమేజ్‌కి తో ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారట.
అయితే ఈ స్టోరీలో ఎక్కువ తమిళ ఫ్లేవర్ ఉండటం, చోళుల బ్యాక్ డ్రాప్ లో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం రిలీజ్ అవడంతో బింబిసార రైటర్ వాసుదేవ్ సహకారంతో ఈ కథ పై వర్క్ చేసిన  డైరెక్టర్ చోళుల కనెక్షన్ తొలగించి, ఒక ఫిక్షనల్ కథగా మార్చినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం అయిన తరువాత ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ మొదలవునుంది.

Also Read: “ఆదిపురుష్‌” మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా వదిలేస్తారా..? ఎందుకో తెలుసా.?