మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఇండియన్ అని తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ అసలు కథ ఏంటంటే?

మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఇండియన్ అని తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ అసలు కథ ఏంటంటే?

by Mohana Priya

Ads

నేటి తరం యువత తన చదువుకున్న ముఖ్యంగా అందానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అద్దం ముందు నించొని  గంటల తరబడి ముస్తాబవుతుంటారు. ఈ అందం మీద పిచ్చి మన సినీ తారలుకు అయితే ఇంకా ఎక్కువ అనుకోవచ్చు.

Video Advertisement

సినీ ప్రపంచంలో రాణించటానికి ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటారు.

 

మరీ ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది మన దేశానికి ఎలా వచ్చింది. అసలు కథ ఏంటో తెలుసుకుందాం.

1794 సంవత్సరంలో జరిగిన కథ ఇది. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కు మరియు బ్రిటీష‌వారికి  మ‌ద్య మూడ‌వ మైసూర్ యుద్దం జ‌రుగుతున్న రోజులవి. బ్రిటీష్ సైనికుల‌కు ఆహార వ‌స్తువుల‌ను తీసుకొని ఓ బండి వెళుతుంది. టిప్పు సైనికులు ఆ బండి న‌డిపేవాడిని ప‌ట్టుకొని రాజు ద‌గ్గ‌రికి తీసుకొచ్చారు.

శ‌త్రువుల‌కు స‌హాయం చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణించిన రాజు అత‌డి ముక్కును కోసేయ‌మ‌ని ఆజ్ఞ వేస్తాడు. రాజు ఆజ్ఞమేరకు ఆ వ్యక్తి ముగ్గులు కోసేస్తారు సైనికులు.

ఆ వ్యక్తి పేరే కోసాజి. టిప్పు సుల్తాన్ తో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు గెలుస్తారు. కోసాజి దగ్గరికి బ్రిటిష్ డాక్టర్ వెళ్లి వైద్యం చేయబోతే , కోసాజి బ్రిటిష్ డాక్టర్ వైద్యాన్ని నిరాకరించి అందరూ ఎంత నచ్చజెప్పిన వినకుండా తనను కుమార్ అనే ఆయుర్వేద వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళమంటాడు .

ఆ కుమార్ అనే ఆయుర్వేద వైద్యుడు కోసాజి నుదిటిపైన చర్మం తీసి తెగిన ముక్కుకు అతికించి కుట్లు వేసాడు. కొంతకాలనికి నుదిటిపై చర్మం సాధారణ స్థితికి వచ్చేసింది . అదేవిధంగా ముక్కు కూడా మంచిగా అతికిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నబ్రిటిష్ డాక్టర్, డాక్టర్ కుమార్ గురించి బ్రిటన్ లో ఉన్నజోసఫ్ అనే డాక్టర్ కి తెలియజేస్తాడు.

ఈ విషయం తెలుసుకున్న జోసఫ్ డాక్టర్ వెంటనే ఇండియాకు వచ్చి ఆయుర్వేద వైద్యుడైన కుమార్ దగ్గర చర్మాన్ని అతికించే  విద్యనభ్యసించి వెంటనే తిరిగి వెళ్ళిపోతాడు.

అయితే ఈ విద్య అనేది  ఆయుర్వేద వైద్యుడు కుమార్ కి ఏ విధంగా వచ్చిందంటే 25000 సంవత్సరాల క్రితం శశ్రుతుడుచే రాయబడిన శశ్రుత సంహిత పుస్తకం నుండి నేర్చుకున్నాడు. అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే విద్య అసలు నిజంగా చెప్పాలంటే మన ఇండియాలోనే పుట్టింది అన్నమాట.

ఈ ప్లాస్టిక్ సర్జరీ విద్య నేర్చుకోవడానికి కారణమైన కోసాజి వివరాలు తెలుపుతూ గీయబడిన చిత్రపటాన్ని బ్రిటన్ ప్రభుత్వం మ్యూజియంలో పెట్టుకుంది.

 


End of Article

You may also like