కాలంతో పాటు సినీ ప్రపంచమూ శరవేగంగా మారిపోతుంది. కథలు చెప్పే విధానంలోనూ కొత్త మార్పులొచ్చాయి. సీక్వెళ్లు.. ఫ్రాంఛైజీ సిరీస్‌ల్ని తలదన్నే మరో కొత్త కథా ప్రపంచం ఊపిరిపోసుకుంది. అదే సినిమాటిక్ మల్టీ యూనివర్స్. ‘అవెంజర్స్’, ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఇప్పటికే హాలీవుడ్‌లో ప్రాచుర్యం పొందిన ఈ ట్రెండ్‌ను.. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అందిపుచ్చుకుంటోంది.
Video Advertisement
అయితే మన దగ్గర కార్తీ నటించిన ఖైదీ చిత్రం తో మల్టీవర్స్ కి శ్రీకారం చుట్టారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు అదే దారిలో అడుగు పెట్టనున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. తన రెండో చిత్రం కెజియఫ్ తో అన్ని ఇండస్ట్రీల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు ప్రశాంత్ నీల్.
అలాగే కేజీఎఫ్ 2 మూవీతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలను కలిగించాడు. కేజీఎఫ్3 కూడా ఉండబోతుందని చెప్పేశాడు. రాఖీభాయ్ బతికే ఉంటాడా? 1978 నుంచి 1981 మధ్యలో ఏం జరిగింది? నరాచి నుంచి మరో కొత్త హీరో బయటికొస్తాడా? అన్న ప్రశ్నలతో కేజీఎఫ్2 ను ముగించాడు. ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసిన ‘సలార్’, ఎన్టీఆర్ 31 సినిమాల నేపథ్యం కూడా కేజీఎఫ్ తరహాలోనే డార్క్ గ్రే కలర్ థీమ్‌లో ఉంది.
కోల్ మైనింగ్ నేపథ్యంలో సాగే ‘సలార్’ సినిమాకు ‘కేజీఎఫ్’తో లింక్ ఉందని టాక్. కేజీఎఫ్2 లో ఈశ్వరీరావు కొడుకు ‘ఫర్మాన్’ అధీర చేతికి చిక్కిన తర్వాత అతడిని చంపేశారా? లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. అంతేకాదు, కేజీఎఫ్2 నుంచే సలార్ సినిమా మొదలవుతుందనీ, చాప్టర్ 2 లో ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ చేసిన ఫర్మాన్ క్యారెక్టరే సలార్‌గా మారుతుందని టాక్ కూడా నడుస్తోంది.
అయితే ప్రశాంత్ నీల్ యూనివర్స్ గురించి ఆయన అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దీనిపై నెట్టింట పలు కథనాలు వస్తున్నాయి. నీల్ వర్స్ ఇలా ఉండబోతుంది అంటూ అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
” సలార్ మూవీ లో అమాయకంగా ఉండే ప్రభాస్.. విలన్ అయిన జగపతిబాబు కి ఎదురు తిరిగి వైలెంట్ గా అయిపోతాడు. అలాగే కేజీఎఫ్ 3 లో రాకీ భాయ్ జిమ్మీ హెల్ప్ తో బయటపడి మళ్ళీ రూలర్ గా మారతాడు. ఆ తర్వాత శృతి హాసన్ ని రాకీ సేవ్ చేసినందుకు సలార్ 2 లో రాకీ భాయ్, సలార్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. అప్పుడు ఎన్టీఆర్ 31 లో ఎన్టీఆర్ తన తండ్రి జగపతి బాబు ని , తాత అధీరా ని చంపినందుకు రాకీ భాయ్, సలార్ పై రివెంజ్ తీర్చుకుంటాడు.” అని నీల్ వర్స్ అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇదే గనక నిజం అయితే రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు మనం చూడొచ్చు.