నిఖిల్ హీరోగా  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం “ది ఇండియా హౌస్”. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Video Advertisement

వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను రీవిల్ చేస్తూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకుడు. ఈ మోషన్ పోస్టర్ లో లండన్‌లోని ఇండియా హౌస్ తగలబడిపోతూ కనిపిస్తుంది. ఇండియా హౌస్ అంటే ఏమిటి?  ఎందుకు అలా అవుతుందో ఇప్పుడు చూద్దాం..
చరిత్ర మరచిన కథలను, గుర్తుంచుకోదగిన కథలను తెలుగు చిత్రాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అలా జాతి  గర్విం చే ఎందరో ప్రముఖులు వెండితెరపై కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో  రామ్‌చరణ్‌, నిఖిల్‌ ఓ మూవీని రెడీ  చేయబోతున్నారు. చరణ్‌ ప్రొడ్యూసర్ గా నిఖిల్‌ హీరోగా ది ఇండియా హౌస్ అనే చిత్రం రాబోతోంది. దీనికి సంబంధించి టైటిల్‌ ప్రకటన జరిగింది. ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
అసలు ఈ ఇండియా హౌస్ అంటే ఏంటి?

లండన్ లోని హైగేట్ ఏరియాలో  క్రోమ్ వెల్ అవెన్యూలో 1905 మరియు 1910 మధ్య ఉన్న స్టూడెంట్ హాస్టల్. బారిస్టర్ చదువుకోవటానికి భారతదేశం నుండి లండన్ వచ్చే స్టూడెంట్స్ లో జాతీయతా భావాలను పెంపొందించడం కోసం  శ్యామ్ జీ కృష్ణవర్మ అనే లాయర్ ఇండియా హౌస్ ను స్థాపించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ శ్యామ్ జీ కృష్ణ వర్మ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు.ది ఇండియన్ సోషియాలజిస్ట్ పేపర్ కటింగ్ లో ఉన్న వారు ఎవరు?

వినాయక్ దామోదర్ సావర్కర్,

మదన్ లాల్ ధింగ్రా,

వీవీఎస్ అయ్యర్,

పాండురంగ్ మహాదేవ్ బాపట్,

మౌడ్ గొన్నె,

ఎంపీటీ ఆచార్య,

అనంత్ లక్ష్మణ్ కన్హేరే,

చెంపకరమన్ పిళ్లై.

ది ఇండియన్ సోషియాలజిస్ట్ అంటే ఏమిటి? 

శ్యామ్ జీ కృష్ణవర్మ ఇండియా హౌస్ తరపున నుంచి ‘ది ఇండియన్ సోషియాలజిస్ట్’ పేరుతో ఒక వార్తా పత్రికను నడిపేవారు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటు వీరుల యొక్క విప్లవ కథలను ప్రచురించి, భారతీయులలో జాతీయతా భావాలను పెంచటమే శ్యామ్ జీ కృష్ణవర్మ ధ్యేయం. స్వాత్రంత్యం సంపాదించడానికి ఇదీ కూడా ఒక మార్గం అని ఆయన నమ్మేవారు.
1905 విప్లవం:

ఇండియా హౌస్ 1905లో లండన్ స్టూడెంట్ హాస్టల్ గా మొదలైనపుడు 30 మంది ఉన్నారు. 5 ఏళ్లలోఇండియా హౌస్ అనేక జాతీయ వాద సంస్థలకు కేరాఫ్ అడ్రస్ మారిపోయింది. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ లాంటివి అలా వచ్చినవే. ఇవి మెల్లగా జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలలోనూ భారత జాతీయభావాలను పెంపొందించే విప్లవ సంస్థలుగా మారిపోయాయి. జాతీయవాద సంస్థలకు ఇండియా హౌస్ కేంద్రంగా మారింది. భారత స్వాత్రంత్యం ను కోరుకునే ఎన్నో సంస్థలు ఇండియా హౌస్ నుంచి నడిచేవి. కొత్తవి పుట్టుకొచ్చేవి.
అలా భారత్ నుంచి వచ్చి, ఇండియా హౌస్ స్కాలర్ షిప్ తో చదువుకునేవారిలో ఒక లా స్టూడెంట్  వీర్ సావర్కర్. 1906లో వీర్ సావర్కర్ ఇండియా హౌస్ కు స్కాలర్ షిప్ తో వచ్చి, మెల్లగా ఓ నాయకుడిగా మారిపోయాడు. ఆ కాలంలో ఇండియా హౌస్ లో బ్రిటీషు అధికారులు ఎక్కువగా సోదాలు నిర్వహించేవారు. అయితే సోషియాలజిస్ట్ పత్రిక ఎడిటర్ అయిన కృష్ణవర్మ ఎంతగానో ఇబ్బంది పడేవాడు.బ్రిటీషర్లు తనను చంపేస్తారని భయపడిన కృష్ణవర్మ 1907లో పారిస్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ పత్రిక బాధ్యతను,  ఇండియా హౌస్ బాధ్యతలను వీర్ సావర్కరే తీసుకున్నాడు. సోషియాలజిస్ట్ పత్రికను ముందుకన్నా ఎక్కువ తీవ్రతతో ప్రచురించడం మొదలు పెట్టాడు. నాస్తికుడైనా సావర్కర్ హిందూత్వ అజెండాతో పనిచేసేవాడు.

Also Read: తన భర్త హఠాన్మరణం వెనుక ఉన్న కథని మొదటిసారి చెప్పిన “భాను ప్రియ” చెల్లి..! అసలు విషయం ఏంటంటే..?