ఉద్యోగం ఉంటేనే పైకొస్తామా..? పని ఏదైనా సంతృప్తి ముఖ్యం..! ఇది కథ కాదు.. కానీ చదివితే నిజమే కదా అంటారు..!

ఉద్యోగం ఉంటేనే పైకొస్తామా..? పని ఏదైనా సంతృప్తి ముఖ్యం..! ఇది కథ కాదు.. కానీ చదివితే నిజమే కదా అంటారు..!

by Anudeep

Ads

మనలో చాలా మందికి సక్సెస్ అంటే కొలమానం ఉద్యోగం మాత్రమే. ఓ మంచి జాబ్ సంపాదించుకుని నెలకు ఐదు లేదా ఆరు అంకెల జీతాన్ని అందుకుంటుంటే..సక్సెస్ అయిపోయినట్లే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ పేరు గొప్ప..ఊరు దిబ్బ టైపు ఉద్యోగాల కంటే.. మనకి నచ్చిన పని చేసుకుంటూనో లేక వ్యాపారం చేసుకుంటూనో కూడా జీవితాన్ని గడపచ్చు. ఏ పని చేసినా మనకి బ్రతకడానికి అవసరమైన సంపాదన తో పాటు ప్రశాంతత కూడా చాలా ముఖ్యం.

Video Advertisement

kirana vs software

ఇలాంటి విషయాలను చెప్పే ఉదాహరణలు మన జీవితాల్లోని కోకొల్లలు ఉంటాయి. ఈ కథ చూడండి.. ఇది నిజం గా జరిగేదే. ఒకరి కింద పని చేయడం ఇష్టం లేని సతీష్ అంటి ముట్టనట్లు చదువు పూర్తి చేసాడు.. మరో వైపు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ టైపు అయిన నిఖిల్ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లోనే మంచి ఉద్యోగం తెచ్చుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిపోయాడు. ఇద్దరు ఇరుగుపొరుగు వారే కావడం తో ఒకరినొకరు ఎదురుపడుతూనే ఉండేవారు. నిఖిల్ దర్జా గా జాబ్ కి వెళ్తూ ఉండేవాడు. సతీష్ మాత్రం తన దగ్గర ఉన్న తెలివితేటలతో వ్యాపారం చేయాలనుకున్నాడు. తల్లి ఇచ్చిన రెండు లక్షలతో పాటు మరో రెండు లక్షలు అప్పు చేసి చిన్న కిరానా షాపు పెట్టాడు.

kirana shops

మాటకారి తనం తో ఎక్కువ మందిని తన ఖాతా లో చేర్చుకున్నాడు. మెల్లగా ఏడాది లోపు సగం అప్పుని తీర్చేసాడు. మరో వైపు నిఖిల్ తనకు వచ్చే శాలరీ పై లోన్ తీసుకుని బండి కొన్నాడు. మరి కొంత ఈ ఎం ఐ లతో ఇంట్లోకి ఫర్నిచర్ వగైరాలు కూడా తీసుకున్నాడు. ఏడాది గడిచేసరికి అతని అప్పు అలానే ఉంది. ఇరవై శాతం వడ్డీని మాత్రం కట్టగలిగాడు. నిఖిల్ మాత్రం సగం అప్పు తీరిందన్నతృప్తి తో ఉండేవాడు.

software 1

సరుకుల ధరలు పెరగడం, కస్టమర్లు పెరగడం తో సతీష్ వ్యాపారం బాగా సాగేది. మరో ఆరు నెలలకు సతీష్ అప్పు తీర్చేసి ఊపిరి పీల్చుకున్నాడు. తన తల్లికి కొంత బంగారం కూడా చేయించగలిగాడు. మరో వైపు నిఖిల్ జీవితం లో పడిపోవడం మొదలైంది. ఉద్యోగం లో హైక్ రాకపోవడం, శాలరీ కంటే నిత్యావసరాల వస్తువుల రేట్లు పెరగడం తో సతీష్ పై భారం రెండింతలైంది. రోజు సతీష్ షాపు ముందు నుంచీ వెళుతూ మనస్పూర్తి గా నవ్వలేకపోయేవాడు. మొదట్లో ఉన్న దర్జా కాస్తా ఇప్పుడు అశాంతి గా మారింది.

software 2

మరో ఏడాది తిరిగేసరికి హైక్ వచ్చిందన్న ఆనందం లో మరి కొంత ఈ ఎం ఐ తీసుకుని నిఖిల్ కారు కొన్నాడు. మరో వైపు లాభాల పంట పండిస్తున్న సతీష్ సొంత డబ్బు తో కారు కొనుక్కున్నాడు. సతీష్ వైపు చూసిన నిఖిల్ ఆలోచనలో పడ్డాడు. తానూ చదువుకునేటప్పుడు చాలా కష్టపడ్డాడు. లైఫ్ ని ఆనందించడమే మర్చిపోయాడు. తీరా జాబ్ వచ్చాక చివరకు మిగిలింది..అప్పులు, ఈ ఎం ఐ లు.. పైకి కనిపించే దర్జా అంతా తన సొంతమేమి కాదు. త్వరలో తానూ తీర్చాల్సిన అప్పుల భారం కంటికి కునుకు లేకుండా చేస్తోంది.

kirana shops 2

మరో వైపు ఆడుతూ పాడుతూ చదువు పూర్తి చేసిన సతీష్ తన సొంత నిర్ణయాలు తీసుకునేంత గా ఎదిగాడు. అప్పుల బాధ లేకుండా సొంత ఇంట్లో, సొంత కార్లో దర్జాను మనస్పూర్తి గా అనుభవించగలుగుతున్నాడు. తనకి సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చినపుడు తన చుట్టూ చేరి చప్పట్లు కొట్టిన వాళ్లెవరు ఇప్పుడు తన మనసులో అశాంతి ని చెరిపెయ్యలేరు అనుకుంటూ భారం గానే రోజులు వెళ్లదీస్తున్నాడు.


End of Article

You may also like