“రొటీన్” స్టోరీ… “యావరేజ్” టాక్… కానీ “కోట్ల” ల్లో కలెక్షన్..! “స్ట్రాటజీ” మామూలుగా లేదుగా..?

“రొటీన్” స్టోరీ… “యావరేజ్” టాక్… కానీ “కోట్ల” ల్లో కలెక్షన్..! “స్ట్రాటజీ” మామూలుగా లేదుగా..?

by Anudeep

Ads

టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఈ సంక్రాంతి రేస్ లో స్టార్ హీరోలు రొటీన్ కథలతోనే అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించారు. కథ లేకుండా కేవలం హీరో కోసం ఫార్ములాను మిక్స్ చేసి హిట్స్ కొట్టేశారు. 2023 సంక్రాంతి సీజన్ లోనూ రొటీన్ స్టఫ్ తోనే సినిమాలొచ్చాయి. టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫార్ములా బేస్ట్, హీరో బేస్డ్ స్టోరీస్ తోనే ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. పండగకి ఎలాంటి చిత్రం వచ్చినా హిట్ అవ్వుద్దని మరోసారి నిరూపించారు స్టార్ హీరోలు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, అజిత్ తునివు, విజయ్ వారసుడు సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

Video Advertisement

అయితే విడుదలైన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా కొత్త కథతో రాలేదు.. అన్నీ మూస ఫార్ములాలే. గత కొంతకాలం గా ప్రయోగాత్మక చిత్రాలు టాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. మన సినిమా కూడా అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుతోంది. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రాలు.. వాటి కలెక్షన్లు చూస్తుంటే టాలీవుడ్ మళ్ళీ వెనక్కి వెళ్తోందా అన్న అనుమానం రాక తప్పదు.

routine movies for this sankrnathi gets profits ..

జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో ఏం లేదు.. అంతా పాత కథే అంటూ పెదవి విరిచారంతా. క్రాక్ తో సరికొత్త కథనాన్ని పరిచయం చేసిన గోపీచంద్ మలినేని బాలయ్య పాత సినిమాలు మిక్సీ పట్టి ఈ చిత్రం తీసాడు. కానీ బాలయ్య సినిమాలకి ఎన్నడూ రానంత ఫాస్ట్ గా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో అక్కడక్కడా సెంటిమెంట్ సీన్స్ అలాగే చిన్న చిన్న అడ్వెస్టులు ఎలివేషన్స్ వీరసింహారెడ్డి విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు.

routine movies for this sankrnathi gets profits ..

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా అంతే.. ఈ మూవీ లో చిరు వింటేజ్ లుక్, మేనరిజమ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో రవితేజ సినిమాను నిలబెట్టాడు. రొటీన్ కథ -కథనంతో వచ్చినా వింటేజ్ చిరుని చూపించి, ఎలివేషన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

routine movies for this sankrnathi gets profits ..

ఇక విజయ్ ‘వారసుడు’ సినిమా అయితే పూర్తిగా రొటీన్ స్టఫ్ తోనే తెరకెక్కింది. ట్రైలర్ చూసే ఇది చాలా తెలుగు సినిమాల సమాహారం అని డిక్లేర్ చేసారు తెలుగు ప్రేక్షకులు. కానీ తమిళనాట ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించింది. విజయ్ మొదటి సారి పూర్తి ఫ్యామిలీ సినిమా చేయడంతో తమిళ్ లో బాగా వర్కౌట్ అయ్యింది. అజిత్ ‘తెగింపు’ సినిమా కూడా రొటీన్ ఫార్ములాతో తీసిన సినిమానే. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో, ఓ మెసేజ్ తో అల్లుకొన్న ఈ సినిమా స్టోరీ టాలీవుడ్ లో మాత్రం థ్రిల్ చేయలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం స్టార్ హీరో కావడంతో, సంక్రాంతి సీజన్ కావడంతో అభిమానులు ఈ సినిమాని కూడా హిట్ చేసి భారీ కలెక్షన్స్ ఇచ్చారు.

routine movies for this sankrnathi gets profits ..

మొత్తానికి సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోలు రొటీన్ కథలతో వచ్చినా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ తీస్తేనే హీరోలకి భారీ కలెక్షన్స్ వస్తాయి అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ సంక్రాంతి సినిమాల రిజల్ట్ చూసాక.. మిగిలిన దర్శకుల ఆలోచనలు కూడా రొటీన్ కథల వైపు పరుగులు పెడతారేమో అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మూస కథల నుంచి బయట పడుతున్న ప్రేక్షకుడ్ని మళ్ళీ వాటిలోనే ముంచి తేల్చేలా ఉన్నారు ఈ స్టార్ హీరోలు.


End of Article

You may also like