Ads
సాధారణంగా స్కూల్స్ లో రూల్స్ ఉంటాయి. కానీ ఇంత కష్టమైన రూల్స్ ని ఎక్కడ చూసి ఉండరు. మరీ కఠినంగా ఉంటాయి జపాన్ స్కూల్ లో రూల్స్. మరి జపాన్ లో ఉండే ఆ రూల్స్ గురించి ఇప్పుడు చూసేయండి.
Video Advertisement
విద్యార్థులు కేవలం చదువు మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని పాఠశాలల్లో అబ్బాయి, అమ్మాయి కలిసి ఎక్కడ వుండకూడదు. స్కూల్లో కానీ బయట కానీ స్కూల్ ఆవరణలో కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇంక మరి ఎక్కడ చదువుకునే అవకాశం ఉండదట.
అలానే ఏ స్కూల్లో అయినా క్యాంటీన్ వుంటుంది. క్యాంటీన్ కి వెళ్లి విద్యార్థులకు నచ్చినవి కొనుక్కుని తెచ్చుకుని తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వెరైటీ. క్యాంటీన్ లో ఏ ఒక్క విద్యార్థి కూడా మనకి కనబడరు. విద్యార్థి కూర్చున్న ప్లేస్ కి నేరుగా ఆహారాన్ని తీసుకువచ్చి ఇస్తారు. అక్కడ స్కూల్లోనే అందరికీ వండి ఫుడ్ ని ఇస్తూ ఉంటారు. విద్యార్థి వేడివేడిగా తినాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ గా కొందరు విద్యార్థులు వచ్చి విద్యార్థులందరికీ ఫుడ్ ని ఇస్తారు.
అలాగే అందరికీ ఒకే మోతాదులో ఫుడ్ ని ఇస్తారు. పైగా పెట్టిన ఆహారాన్ని మిగల్చకుండా తినాలి అనేది కూడా ఒక రూల్.
పిల్లలకు వేసవి సెలవులు కూడా ఉండవు. కేవలం ఐదు వారాలు మాత్రమే వీళ్ళకి సెలవులు. ఆ సెలవుల్లో కూడా ఉపాధ్యాయులతో కలిసి వీళ్ళు ఆక్టివిటీస్ చేయాలి.
అలానే స్కూల్ మొత్తం అంతా కూడా టీచర్లు మరియు విద్యార్థులు మాత్రమే శుభ్రం చేయాలి. టాయిలెట్ల నుండి తరగతి గదుల వరకు అంతా వీళ్ళే శుభ్రం చేయాలి. దీని వల్ల విద్యార్థులకు పరిశుభ్రత అంటే ఏంటో తెలుస్తుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిలకి కూడా కొన్ని కఠిన రూల్స్ వున్నాయి. అవేంటంటే అమ్మాయిలు హెయిర్ స్టైల్ చేసుకోకూడదు. మేకప్, బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి వాడకూడదు. ఒకవేళ కనుక అలా చేసారంటే జపాన్ లో ఏ స్కూల్లో కూడా ఎంట్రీ ఉండదు.
అప్పుడప్పుడూ జపాన్ కి బయట టీచర్స్ వచ్చి గెస్ట్ లెక్చర్ ఇస్తారు. అప్పుడు ఇంగ్లీష్ లో కనుక టీచర్ మాట్లాడితే అక్కడ ఉన్న విద్యార్థులు టీచర్ రెండు కాళ్ళ మధ్యలో వేళ్ళు పెట్టి ఏడిపిస్తారు. అలానే అక్కడ స్విమ్మింగ్ కోసం ప్రత్యేకమైన పీరియడ్ వుంటుంది. ప్రతి విద్యార్థి కూడా స్విమ్మింగ్ నేర్చుకుని తీరాలి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే వాళ్ళకి ప్రత్యేక తరగతులు పెడతారు. పైగా స్విమ్మింగ్ వస్తేనే మరో తరగతికి ప్రమోట్ చేస్తారు.
End of Article