ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కొంతమంది నిద్రని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ నిద్ర ఎక్కువ పోయినా, కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది సిస్టమేటిక్ గా రోజు కొన్ని గంటలు లిమిట్ పెట్టుకొని, రోజూ ఒకే సమయానికి పడుకుంటారు, మళ్లీ పొద్దున్నే ఒకటే సమయానికి లేస్తారు. ఇంకొంతమంది ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడూ లేచినా కూడా వాళ్లు నిద్రపోయే సమయం, అంటే ఎన్ని గంటలు నిద్ర పోవాలి అనేది మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. అలా కొంతమంది ప్రముఖులు రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారో ఇప్పుడు చూద్దాం.

#1 బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయిన బిల్ గేట్స్ 7 గంటలు (9:30pm — 4:30am) నిద్రపోతారు.

#2 ఎలాన్ మస్క్

టెస్లా ఇంకా స్పేస్ ఎక్స్ కి సీఈవో అయిన ఎలాన్ మస్క్, 6 గంటలు (1am — 7am) నిద్రపోతారు.

#3 జాక్ డోర్సే

ట్విట్టర్ కో ఫౌండర్ అయిన జాక్ డోర్సే 7 గంటలు (10:30pm — 5:30am) నిద్రపోతారు.

#4 నరేంద్ర మోదీ

భారత దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ మూడు నుండి మూడున్నర గంటలు నిద్రపోతారు.

#5 టిమ్ కుక్

ఆపిల్ సీఈవో అయిన టిమ్ కుక్ 7 గంటలు (9:30pm — 4:30am) నిద్రపోతారు.

#6 డోనాల్డ్ ట్రంప్

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన డోనాల్డ్ ట్రంప్ 3 గంటలు (1–4am) నిద్ర పోతారు.

#7 సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన సత్య నాదెళ్ల 8 గంటలు (11am – 7am) నిద్రపోతారు.

#8 జెఫ్ బెజోస్

అమెజాన్ ఫౌండర్ ఇంకా సీఈవో అయిన జెఫ్ బెజోస్ 7 గంటలు (10pm — 5am) నిద్ర పోతారు.

#9 ఇంద్ర నూయి

పెప్సీ కో చైర్మన్ ఇంకా సీఈవో అయిన ఇంద్ర నూయి 4 గంటలు నిద్ర పోతారు.

#10 బరాక్ ఒబామా

యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 6 గంటలు (1am — 7am) నిద్రపోతారు.

#11 సుందర్ పిచాయ్

ఆల్ఫాబెట్ సీఈవో ఎం సుందర్ పిచాయ్ 5 గంటలు నిద్ర పోతారు. ఒక ఇంటర్వ్యూలో ఉదయం 6:30 కి లేదా 7 గంటలకి నిద్ర లేస్తాను అని సుందర్ పిచాయ్ చెప్పారు.

#12 షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 4 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతారు.

#13 ఎల్లెన్ డిజెనెరెస్

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ది ఎల్లెన్ షో హోస్ట్ అయిన ఎల్లెన్ డిజెనెరెస్ 8 గంటలు (11pm — 7am) నిద్రపోతారు.

#14 మార్క్ జుకర్ బర్గ్

ఫేస్ బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్ బర్గ్ రోజుకి 5 గంటలు నిద్రపోతారు.

#15 బిల్ క్లింటన్

యునైటెడ్ స్టేట్స్ కి 42వ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ రోజుకి 5 నుండి 6 గంటలు నిద్రపోతారు.