పిల్లలు పుట్టాలని దీవించండి..! బిగ్‌బాస్‌లో ఎమోషనల్ అయిన సుదీప..!

పిల్లలు పుట్టాలని దీవించండి..! బిగ్‌బాస్‌లో ఎమోషనల్ అయిన సుదీప..!

by Anudeep

Ads

నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అల్లరి పిల్లగా చేసిన సుదీప ఇప్పుడు పాపం పిల్లల కోసం తపస్సు చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో సుదీప స్టోరీ విని అందరూ కంట తడి పెడుతున్నారు.కేవలం తన తప్పిదం వల్లే దేవుడు తనని పరీక్షిస్తున్నాడేమో అంటూ బాధపడింది.

Video Advertisement

2015 లో తను కన్సీవ్ అయ్యిందట కానీ….అప్పుడు ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ చేసే అవకాశం రావడం తో మరియు ఇంకా సెటిల్మెంట్ అనేది లేకపోవడం వల్ల అప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంది. అందుకే ఆస్ట్రేలియాలో ప్రోగ్రామ్ చేసి వచ్చిన తర్వాత అబార్షన్ చేయించుకుంది.

biggboss contestents remunirtion details

ఆ తర్వాత మూడు సంవత్సారాల కు కొద్దిగా సెటిల్ అయ్యాక పిల్లలకోసం ప్రయత్నించాం. కన్సీవ్ కూడా అయ్యాను. కానీ, మూడో నెలలోనే స్కానింగ్ కి వెళ్లే టైమ్ లోనే అబార్షన్ అయిపోయింది అని చెప్పి కనీరు మున్నీరు అయ్యింది. అప్పుడు ఆమెకు థైరాయిడ్ కూడా చాలా హై అయ్యింది. పాపం తన భర్త ఎంత దైర్యం చెప్పినా ఫస్ట్ లో ఉన్న కాన్ఫిడెన్స్ మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నట్లు ఫీల్ అయింది.

sudeepa became emotional in bigg boss telugu 6 episode

అప్పట్నుంచీ ఎంతో మంది డాక్టర్స్ దగ్గరకి వెళ్లాం. ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ నమ్మకం సన్నగిల్లుతూ వచ్చింది. నాకు కొనిసార్లు ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతానేమో అని భయవేసేది. అప్పుడే బిగ్ బాస్ ఆపర్ వచ్చింది. ఇక్కడకు వచ్చి మీ అందరి స్టోరీల గురించి తెలుసుకున్నాను. నేను ఎప్పుడూ
సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండను. ఈ అవకాశం ఉపయోగించి తిరిగి మళ్లీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి బిగ్ బాస్ షో కి వచ్చానని చెప్పింది.

sudeepa became emotional in bigg boss telugu 6 episode

ఆమె భర్త రంగనాధ్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం. సుదీప చెల్లి కూతురితో అతను బాగా ఆడుకుంటారని అంది.
బేబీ టాస్క్ వచ్చినపుడు సుదీప బేబీ అని రాసి ఉన్న ట్యాగ్ చూస్తే కన్నీళ్లు ఆగలేదని పార్టిసిపెంట్స్ తో తన మనసులో మాటని బయటపెట్టింది. ఎప్పుడూ గల గల మాట్లాడుతూ నవ్వుతూ నవ్వించే సుదీప జీవితంలో ఇలాంటి ఒక బాధ దాగి ఉందని అప్పుడు కానీ హౌస్ మేట్స్ కు ఆడియన్స్ తెలియలేదు.


End of Article

You may also like