Ads
తెలుగు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ మూవీకి స్క్రీన్ ప్లే అందించిన విషయం అందరికి తెలిసిందే. మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పేరుగాంచిన సుకుమార్ యొక్క శిష్యుడు కార్తీక్ దండు చిత్రాన్ని తెరకెక్కించారు.
Video Advertisement
మూవీలో ఎక్కడ కూడా బోర్ అనిపించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో కార్తీక్ విజయం సాధించారు. కాగా ఈ మూవీలో సుకుమార్ పెట్టుబడులు పెట్టాడని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయం పై మరో వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో చూద్దాం..
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే ఎక్కువ వసూళ్లను సాధించే దిశగా వెళ్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సుప్రీం హీరోకు మంచి కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో సుకుమార్ ఇన్వెస్ట్ చేయలేదని, ఈ మూవీ స్క్రీన్ ప్లే పై వర్క్ చేసినందుకు గానూ ఆరు కోట్లు తీసుకున్నారని సమాచారం. అలాగే ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఆధారంగాను లాభాల్లో సుకుమార్ వాటా తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఎస్విసీసీతో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామి. ఈ మూవీ స్క్రిప్ట్ కోసం సమయాన్ని వెచ్చించి మరి సుకుమార్ కీలకమైన ట్విస్ట్‌లతో స్టోరిని ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఈ మూవీ మేకర్స్‌కు లాభాలు రావడంతో సుకుమార్ తన వర్క్ కి 6 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సోనియా సింగ్, అజయ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కి ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ లోక్‌నాథ్ సంగీతంతో పాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ను అందించారు.
Also Read: 50 ఏళ్ల వయసుకి దగ్గరగా ఉన్నా…ఇప్పటివరకు “శోభన” ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా.? కారణం ఆ హీరో.?
End of Article