టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనాలకు మనం అబద్ధాలు చెప్పినా నిజాలు కనిపిస్తాయని నిజాలు చెప్పినా అబద్ధాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే నా ఉద్దేశంలో పెద్ద మెసేజ్ అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
Video Advertisement
చిన్నప్పుడు పెద్ద సైంటిస్ట్ కావాలని అనుకున్నా కానీ, చివరికి లెక్కల లెక్చరర్ గా మారానన్నాడు. లెక్చరర్ గా వచ్చే రెస్పెక్ట్ ను బాగా ఎంజాయ్ చేస్తానని, 7 సంవత్సరాలు నేను లెక్చరర్ గా పని చేశానని ఆయన తెలిపారు. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొత్త షర్ట్ కొనుక్కోవాలన్నా ఆలోచించే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు.
రాజమౌళి గారు నేను గొప్ప పోటీ అని చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందని ఆయన కామెంట్లు చేశారు. జగడం సినిమా సమయంలో రాజమౌళి ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఇటీవల పూరి జగన్నాథ్ తో చేసిన ఒక చిట్ చాట్ లో ఆయన ఈ విషయాలు వెళ్ళ డించారు.
ప్రతి మనిషి రకరకాల ఎమోషన్స్ కలయిక అని ఆయన కామెంట్లు చేశారు. మనిషి ఫిజికల్ స్టేటస్ సైకలాజికల్ స్టేటస్ బయటకి కనిపించి జనాలు అలా డిసైడ్ అవుతారని ఆయన తెలిపారు.
ఇకపోతే.. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ అయినా సుకుమార్ ఒక ఆసక్తికర విషయం తెలిపారు. ‘అ అంటే అమలాపురం’ సాంగ్ ద్వారా ఆర్య సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా రీచ్ అయిందని సుకుమార్ తెలిపారు. ఐటమ్ సాంగ్ పెడితే బిజినెస్ పరంగా ప్లస్ అవుతుండటంతో ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండేలా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.రికార్డ్ స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప ది రైజ్ ను మించి ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘లైగర్’ ప్రమోషన్స్ లో భాగంగా పూరిని సుకుమార్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తరువాత తన సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఆ సమయంలో కూడా సుకుమార్ చెప్పాడు. ‘లైగర్’ హిట్ అయితే విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చేది. కానీ ఆ సినిమా పోవడంతో సుకుమార్ వెనక్కి తగ్గినట్టుగా చెబుతున్నారు. ‘పుష్ప’తో తనకి వచ్చిన క్రేజ్ ను కాపాడుకోవడంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.
విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఉండవలసి ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమేననే టాక్ బలంగానే వినిపిస్తోంది. సుకుమార్ ఆ ఆలోచనను పక్కన పెట్టాడని అంటున్నారు.