మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి లాభాలే లాభాలు.. మరి మీరూ ఉన్నారేమో చూడండి..!

మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి లాభాలే లాభాలు.. మరి మీరూ ఉన్నారేమో చూడండి..!

by Megha Varna

Ads

మార్చి 15వ తేదీన మీన రాశి లోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీని మూలంగా సృజనాత్మకత, ఆధ్యాత్మికత అంశాలపై ప్రభావం పడుతుంది. అయితే ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం దీని గురించి ముఖ్యమైన విషయాలను చెబుతోంది.

Video Advertisement

రాశిచక్రంలోని రాశులు ద్వారా సూర్యుడు సంచారం వలన జీవితం పై ప్రభావం పడుతుంది. అయితే మరి మీ రాశి మీద ఎలాంటి ప్రభావం పడిందో కూడా చూసేయండి.

మేష రాశి:

మేష రాశి వాళ్లు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఉద్యోగులకు కలిసివస్తుంది. అలానే మీ ఖర్చులకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. పిల్లల విషయంపై నిరాశ కలుగుతుంది.

వృషభ రాశి:

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు అనుకూలం. మీ ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. బంధాలు బలపడతాయి. మీ కుటుంబంతో పాటు కలిసి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

మిధున రాశి:

మీరు మంచిగా బాధ్యతలు నెరవేరుస్తారు. చక్కటి ప్రశంసలు అందుకుంటారు. ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. పైగా మీ శ్రమకు తగ్గ ఫలితం కూడా మీకు అందుతుంది.

కర్కాటక రాశి:

వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. అలానే మీ నైపుణ్యాలను బయట పెట్టడానికి ఇదే సరైన సమయం. దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తే మంచిది. అలానే మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే కూడా కలిసి వస్తుంది.

సింహరాశి:

మీరు వెళ్లే మార్గంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగ సమస్యలు కూడా ఉండే అవకాశం వుంది. స్టాక్ మార్కెట్ వంటివాటిలో డబ్బులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి.

కన్య రాశి:

వృత్తిపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చిన్నచిన్న వాటి వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తులారాశి:

మీ సామర్థ్యం చాలా విలువైనది అని సహచరులు నమ్ముతారు. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుంటారు. చట్టపరమైన సమస్యలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది.

వృశ్చిక రాశి:

వ్యాపారస్తులకు ఇదే సరైన సమయం. విద్యార్థులు ప్రతిభ చాటుతారు. అలానే విద్య పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది.

ధనస్సు రాశి:

మీరు మీ పనిలో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంపై కూడా దృష్టి పెట్టండి. అలానే మీ వలన మీ సంస్థ అభివృద్ధి చెందుతుంది. ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి:

మీరు ఎంతో మొండిగా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. వృత్తి పరమైన విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ సంబంధిత బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది.

కుంభరాశి:

సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వుండండి.

మీన రాశి:

పనులను సకాలంలో పూర్తి చేయడంలో నిదానంగా వున్నా నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. మీరు కాస్త అహంకారంతో ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.


End of Article

You may also like