Sundaram Master Movie Review: “వైవా హర్ష ” హీరోగా నటించిన మొదటి సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Sundaram Master Movie Review: “వైవా హర్ష ” హీరోగా నటించిన మొదటి సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయిన వైవా హర్ష, ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా బిజీగా మారాడు.  హర్ష తొలిసారి హీరోగా నటించిన మూవీ సుందరం మాస్టర్.  నేడు థియేటర్స్ లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : సుందరం మాస్టర్
  • నటీనటులు : హర్ష చెముడు, హర్ష వర్ధన్, దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం తదితరులు
  • నిర్మాత : రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
  • దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్
  • సంగీతం : శ్రీచరణ్ పాకాల
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024

స్టోరీ:

మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామంలో, సుందరం మాస్టర్ (హర్ష చెముడు) గవర్నమెంట్ పాఠశాలలో టీచర్. అతనికి వివాహం కానీ,సుందరం తాను గవర్నమెంట్ టీచర్ కావడంతో కట్నం ఎక్కువ కావాలని, వచ్చిన పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం కోసం చూస్తుంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) పాఠశాలకి వచ్చి అందులోని టీచర్స్ అందరిని చూసి సుందరంని ఎంపిక చేస్తాడు.  ఇంగ్లీష్ చెప్పే పేరుతో ఒక పని అప్పగించి, అడవిలో మారుమూల గూడెం అయిన మిర్యాలమెట్టకు ఇంగ్లీష్ టీచర్‌గా పంపిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన సుందరం మాస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడే ఊరివారిని చూసి షాక్ అవుతాడు? ఆ గూడెం వాసులు సుందరం మాస్టర్ తో ఎలా ప్రవర్తిస్తారు? ఆ గూడెంకు వెళ్లిన పనిని చేశాడా? ఆ క్రమంలో సుందరం మాస్టర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ.

రివ్యూ:

సినిమా ప్రారంభం నుంచి ఎక్కువ సేపు సాగదీయకుండా దర్శకుడు నేరుగా కథలోకి తీసుకువెళ్లాడు. అత్యాశ ఉన్న గవర్నమెంట్ టీచర్ డీఈవో పోస్ట్ కోసం ఆశపడి అడివిలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గూడానికి వెళ్ళి, ఎమ్మెల్యే చెప్పిన విలువైన వస్తువును తీసుకొచ్చేందుకు రెడీ అవుతాడు. ఇంగ్లీష్ అంతగా రాని సోషల్ టీచర్ ఇంగ్లీష్ చెప్పడానికి ఆ గూడానికి వెళ్ళడం.

గూడెం వాసులకు ఇంగ్లీష్‌ రాదని భావించి, సుందరం మాస్టారు వారికి ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నాలు ఆడియెన్స్ ని నవ్విస్తాయి. ఫస్టాఫ్‌ కామెడీతో సాగింది.సెకండాఫ్ ఆ గూడెం దేవత విగ్రహం మాయమవడం,కల్మషం లేని మనుషులు,మానవత్వం, ప్రకృతి వంటి ఎమోషన్స్ తో సాగుతుంది. అయితే ఆ సీన్స్ డీల్‌ చేయడంలో డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ఫస్టాఫ్‌ కామెడీగా సాగగా, సెకాండాఫ్‌లో నిరాశపరిచాడు.

కామెడీతో మెప్పించిన వైవా హర్ష, ఈ సినిమలో కామెడీ మరియు అన్ని రకాల ఎమోషన్స్ ని పండించాడు. సుందరం మాస్టర్ పాత్రకు హర్ష మాత్రమే సెట్ అవుతాడు అనేలా నటించాడు. దివ్య శ్రీపాద ఆ గూడెంలో ఉండే అనాధ పిల్లగా చక్కగా నటించింది. గూడెం ప్రజలుగా నటించిన నటినటులంతా బాగా చేశారు.

ప్లస్ పాయింట్స్:

  • వైవా హర్ష పర్ఫార్మెన్స్
  • ఫస్టాఫ్‌ కామెడీ

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సీన్స్  అసహజంగా అనిపిస్తాయి
  • క్లైమాక్స్‌ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు

రేటింగ్ :

2.5/5

watch trailer :

Also Read: SIDDHARTH ROY REVIEW: “అతడు చైల్డ్ ఆర్టిస్ట్” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like