పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు సైన్ చేసారు. వాటిలో ఒకటి ‘హరిహర వీరమల్లు‘. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ రూపొందుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరొకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఆ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాటు సుజీత్ డైరెక్షన్లో కూడా ఓ సినిమాని ప్రారంభించారు పవన్. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.

Video Advertisement

 

 

`ఓజీ`(ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్‌) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. సుజీత్ సాహో తర్వాత పవన్ కళ్యాణ్‌తో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాను కేవలం పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో ఈ సినిమాను ప్లాన్ చేసారట దర్శకనిర్మాతలు.

sunil role in pavan kalyan - sujeeth movie..!!

అయితే ‘ఓజి’ గురించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ గా సునీల్ నటించబోతున్నారట. అతనొక సీక్రెట్ మాఫియా డాన్ గా కనిపిస్తాడు అని సమాచారం. సునీల్ కు ఇంత బంపర్ ఆఫర్ రావడం వెనుక అతని స్నేహితుడు త్రివిక్రమ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సునీల్.. తర్వాత హీరోగా మారాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడం తో మళ్ళీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా తిరిగి నటించడం మొదలు పెట్టారు.

sunil role in pavan kalyan - sujeeth movie..!!

ఈ నేపథ్యం లోనే విభిన్న పాత్రలు ఎంచుకుంటూ.. విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే సునీల్ విలన్ గా చేయడం ఇది మొదటిసారి కాదు. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’, సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’, అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు పవన్ కి ప్రతినాయకుడిగా నటించబోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’ ‘బాలు’ ‘జల్సా’ వంటి సినిమాల్లో సునీల్ కమెడియన్ గా అలరించారు. ఇప్పుడు వీరిద్దరి కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి..