మన చిన్నప్పుడు మనల్ని అలరించిన 9 పిల్లల సినిమాలు..! మీ ఫెవరెట్ ఏంటి.?

మన చిన్నప్పుడు మనల్ని అలరించిన 9 పిల్లల సినిమాలు..! మీ ఫెవరెట్ ఏంటి.?

by Anudeep

Ads

కామెడీ, లవ్, యాక్షన్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్.. ఇలా రకరకాల సినిమాలు మాత్రమే కాకుండా ఇంకో కేటగిరీ కూడా ఉంది. అదే అండి.. కిడ్స్ సెక్షన్. చిన్న పిల్లల సినిమాలు. మన చిన్నతనం లో కూడా ఈ సినిమాలను పదే పదే చూసి ఉంటాం. ఈ సినిమాలు అంత గా ఆకట్టుకుంటాయి మరి. మన చిన్నతనాన్ని మరో సారి గుర్తుకు తెచ్చే ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దామా మరి..

Video Advertisement

1. బాల రామాయణం:

1 bala ramayanam
ముందు గా రామాయణం తోనే మొదలుపెడతాం. జూనియర్ ఎన్టీఆర్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇది తొలి సినిమా. 90 ల కాలం లో గుణశేఖర్ ఈ సినిమా ను రూపొందించారు. ఈ సినిమా కి అంతగా కలెక్షన్లు రాకపోయినా.. బాల నటులుగా నటించిన వారందరు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

2. లిటిల్ సోల్జర్స్:

2 little soldiers
ఈ సినిమా ను ఇప్పుడు కూడా చూస్తూ ఎంజాయ్ చేసే వారున్నారంటే నమ్మాలనిపించడం లేదా..? మీరు చూడండి అయితే.. సరదాగా ఉంటూనే మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రోహిణి, వీరందరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఈ సినిమా కి గంగరాజు గున్నం దర్శకత్వం వహించి నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. బేబీ కావ్య కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె సినిమాల్లో అంతగా రాణించకపోయిన ఆ ఫేమ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. అంత ఈజీ గా మర్చిపోలేం మరి.

3. అంజలి:

3 anjali
మణిరత్నం అంజలి సినిమా కూడా కిడ్స్ కలెక్షన్ లో సూపర్ హిట్ సినిమా. అంజలి ని అంత ఈజీ గా మరచిపోలేము. ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ షాలిని హీరోయిన్ గా కూడా నటించిన సంగతి తెలిసిందే. సిద్ధూ పక్కన “ఓయ్” సినిమా లో నటించింది. హైపర్ ఆక్టివ్ గా ఉండే పిల్లలను పేరెంట్స్ ఎలా ట్రీట్ చేయాలి, వారిపట్ల ఎలాంటి ప్రత్యేక కేరింగ్ చూపించాలి అన్న కధనం తో ఈ సినిమా తీశారు. అప్పట్లో పేరెంట్స్ కి, కిడ్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపొయింది.

4. సిసింద్రీ:

4 sisindri
“బేబీస్ డే అవుట్” అనే ఇంగ్లీష్ సినిమా ను స్ఫూర్తి గా తీసుకుని శివ సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పై చేసిన నాగేశ్వరరావు సిసింద్రీ సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే ఆరు కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఓ మ్యాగజైన్ లో అమలతో పాటు ఉన్న అఖిల్ ఫోటో ను చూసి ఈ సినిమా లో అఖిల్ నే తీసుకోవాలని నాగేశ్వరావు అనుకున్నారట. అయితే అందుకు మొదట అమల ఒప్పుకోలేదట. ఆయన నాగార్జున ను సంప్రదించగా.. నాగ్ కూడా చాలా ఆలోచించి ఆ తరువాత ఒప్పుకున్నారట.

5. స్వయం కృషి:

5 swayam krushi
ఈ సినిమా మెగాస్టార్ సినిమా. మెగాస్టార్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. కే విశ్వనాధ్ గారు ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో ఓ బుడ్డోడు ఉంటాడు. మొండి వైఖరి తో ఉండే పిల్లాడిని మెగాస్టార్ స్వయం కృషి పైకి రావాలన్న విషయాన్ని ఆ పిల్లాడి కి అర్ధం అయ్యేలా చెప్పే సన్నివేశం ఈ సినిమా కె హై లైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ని కచ్చితం గా పిల్లలకు చూపించాలి.

6. లవకుశ:

6 lavakusa
శ్రీరామా చంద్రుని పిల్లలు లవకుశలు. వారు పుట్టడమే అడవుల్లో ఆశ్రమం లో జన్మించారు. అయినా, తండ్రి పట్ల వినయం కలిగి ఉండి..తండ్రి తో సమానం గా ధీరత్వాన్ని కూడా ప్రదర్శించగలిగిన వారు. ఇలాంటి సినిమాలను మన పిల్లలకు చూపించడం ద్వారా మన పురాణాల్లోని గొప్పదనాన్ని, పిల్లలను ఎదగడానికి సరైన మార్గదర్శకం చేసిన వారం అవుతాము. ఎన్టీఆర్, అంజలి దేవి ఈ సినిమాలో సీతారాములు గా నటించారు. బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా రికార్డు లు సృష్టించింది.

7. పసివాడి ప్రాణం:

7 pasivadi pranam
ఇది కూడా అచ్చు మెగాస్టార్ సినిమా. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు రకరకాల కాన్సెప్ట్ లతో సినిమాలు చేసారు. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. మలయాళం సినిమా కొండరామిరెడ్డి కి పసివాడి ప్రాణం సినిమా రీమేక్. ఆరోజుల్లోనే ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8. రేపటి పౌరులు :

8 repati pourulu
విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన సినిమా రేపటి పౌరులు. డా.రాజశేఖర్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, పి ఎల్ నారాయణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విద్యావ్యవస్థ ఎలా అవినీతిపరం అవుతోంది, బాలల భవిష్యత్తులు ఎలా మారిపోతున్నాయి అన్న కధాంశం తో ఈ సినిమాను రూపొందించారు. మారుతున్న విద్యా వ్యవస్థ వలన పిల్లలు చదువు పై ఎలా ఆసక్తి ని కోల్పోతున్నారు.. ఈ సమస్య కి పరిష్కారం ఏమిటి అన్న విషయాలను ఈ సినిమాలో చూపించారు.

9. బాల భారతం:

9 bala bharatham
భారతం లో కౌరవులు, పాండవులు చిన్నతనం లో ఎలా ఉండేవారో చూపించే సినిమా “బాల భరతం”. అసలు గుణ శేఖర్ “బాల రామాయణం” సినిమాను తీయడానికి ఈ సినిమా కూడా ఓ కారణం. చిన్న పిల్లలకు సినిమాల ద్వారా మన పురాణాల గొప్పదనాన్ని గురించి అందించే ప్రయత్నాలే ఈ సినిమాలు. బాల భారతం సినిమా కూడా ఇటు పిల్లలకు అటు పెద్దలకు బాగా నచ్చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా.


End of Article

You may also like