Ads
నట శేఖర కృష్ణ..తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో బాలీవుడ్ లో సత్తా చాటుతూ ఆ సినిమా కాసుల వర్షం కురిపించింది. నిర్మాత, దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం.. మంచి మనసున్న వ్యక్తి.. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు.
Video Advertisement
జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎమ్ ఎమ్, ఈస్టమన్ కలర్ నుంచి రంగుల సినిమా ఇలా అనేక రకాల జోనర్లను, కొత్త సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ. తాజాగా కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం తో ఆర్గాన్ ఫెయిల్యూర్తో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. అంటే 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాల్లో నటించారు. అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. కృష్ణ ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో మరే సినీ నటుడికీ ఇలాంటి రికార్డు లేదు.
అంతే కాకుండా ఆయన చేసిన ఒక రికార్డు ఇప్పటివరకు ఎవరు చేయలేదు.. భవిష్యత్తులో చేయలేరు కూడా.. అదేంటంటే.. స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే జనాలు..ఒకే రకంగా ఇద్దరు హీరోలను చూస్తే డబుల్ ఖుషీ అవుతారు. ఇక త్రిపుల్ రోల్ చేస్తే ఆ ఆనందాని అవధులు ఉండవు. అలా తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో ఎక్కువ చిత్రాల్లో త్రిపుల్ రోల్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కారు. ఈయన మొత్తం ఏడు చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేసారు.
అవేంటంటే..సూపర్ స్టార్ కృష్ణ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ‘కుమారాజా’. ఈ సినిమా. ఈ చిత్రం కన్నడలో రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. పి.సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ రెండోసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘డాక్టర్ సినీ యాక్టర్’. ఈ సినిమాలో కృష్ణ, తనయుడు, మేనల్లుడుగా త్రిపాత్రాభినయం చేసారు. కృష్ణ మూడోసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘పగపట్టిన సింహం’. ఈ సినిమాను పి.చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కృష్ణ.. గూండాగా.. పోలీస్ ఆఫీసర్‌గా.. లాయర్‌గా మూడు పాత్రల్లో నటించారు.
కృష్ణ నాలుగో సారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘సిరిపురం మొనగాడు’. ఈ సినిమాను కే.యస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో కృష్ణ తండ్రీ కొడుకులుగా పోలీస్ ఆఫీసర్‌గా.. విలన్‌గా మూడు పాత్రల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ ఐదోసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘బంగారు కాపురం’. ఈ చిత్రంలో కృష్ణ.. తండ్రీ ఇద్దరు కుమారులుగా నటించారు.విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ.. తండ్రీ ఇద్దరు తనయులుగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ రక్త సంబంధం. ఈ సినిమా తమిళంలో శివాజీ గణేషన్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేసిన ‘దైవమగన్’ సినిమాకు రీమేక్.
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేసిన ఏడో చిత్రం ’బొబ్బిలి దొర’. బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ సరసన విజయ నిర్మల, సంఘవి నటించారు. ఈ సినిమాలో కృష్ణ అన్నాదమ్ములుగా నటించారు. మరో కృష్ణ ఒక హీరో కుమారుడి పాత్రలో నటించారు.
End of Article