ఐదుగురు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

ఐదుగురు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

by Anudeep

Ads

వరుస హిట్లతో మహేష్ బాబు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో వచ్చిన “సర్కారు వారి పాట” మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇందుకు గాను ఐదుగురు టాప్ డైరెక్టర్స్ తో చర్చలు జరిపినట్టు సమాచారం.

Video Advertisement

మహేష్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లో రానుందని చిత్ర బృందం ఇంతకు ముందే ప్రకటించింది.
మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు, ఖలేజా లో నటించాడు.
వీరిద్దరి కలయికలో వచ్చే హ్యాట్రిక్ మూవీ పై ఇటు గురూజీ అభిమానులకు, మహేష్ ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ కాగా తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసాడు మహేష్ బాబు. ఇది పూర్తయిన వెంటనే లెక్కల మాస్టర్ సుకుమార్ తో మరో క్రేజీ ప్రాజెక్టు ఓకే చేసినట్టు సమాచారం. ఈలోపు సుకుమార్ పుష్ప 2 కూడా పూర్తవుతుంది.

సుక్కుతో సినిమా పూర్తయిన వెంటనే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో మరో సినిమా చేయనున్నాడు. ఆలోపు సందీప్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ పూర్తి చేయనున్నాడు. ఇవి పూర్తవగానే మహేష్ తో మరో సినిమా కోసం ఎదురు చూస్తున్న స్టార్ డైరెక్టర్ పూరీకి మరోసారి ఛాన్స్ ఇచ్చాడట మహేష్ బాబు.

ఇప్పటికే వీరి కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మాన్ వంటి సూపర్ హిట్లు ఉన్నాయి. దీంతో వీరి కాంబినేషన్ పై కూడా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇలా మొత్తానికి మహేష్ టాప్ డైరెక్టర్స్ తో మూవీస్ చేసేందుకు పక్కా ప్లాన్ తోనే ఉన్నట్టు సమాచారం.

https://telugustop.com/mahesh-babu-strong-lineup-with-top-directors


End of Article

You may also like