ఎవరు ఈ సురేష్ కొండేటి.. ఆయన నిర్మించిన సినిమాలు ఏవి..? ఆయన సినీ ప్రస్థానం ఏంటంటే..?

ఎవరు ఈ సురేష్ కొండేటి.. ఆయన నిర్మించిన సినిమాలు ఏవి..? ఆయన సినీ ప్రస్థానం ఏంటంటే..?

by kavitha

సురేష్ కొండేటి, ఈ పేరుని తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ సినీ జర్నలిస్టు, నిర్మాత, ‘సంతోషం’ మ్యాగజైన్ అధినేతగా సంతోషం ఫిలిం అవార్డులను అందించడం తెలిసిందే.

Video Advertisement

ముఖ్యంగా సినిమా ప్రెస్ మీట్లలో తనదైన శైలిలో ప్రశ్నిస్తూ హీరోహీరోయిన్లను ఇరకాటంలో పెడుతూ సురేష్ కొండేటి తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం గోవాలో సంతోషం సినీ అవార్డుల వేడుకను నిర్వహించగా, అది కాంట్రవర్సీ కావడం తెలిసిందే. సురేశ్ కొండేటి గురించి ఇప్పుడు చూద్దాం..
సురేష్‌ కొండేటి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, వేడంగిపాలెంలో జన్మించాడు. సురేష్ కొండేటి న్యూస్ పేపర్ లో సినీ జర్నలిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టారు. అలా పలు న్యూస్ పేపర్లలో పని చేశాడు. 2002లో ‘సంతోషం’ సినీ వీక్లీ మ్యాగజైన్ ను స్థాపించాడు. 1992లో సురేష్ కొండేటి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 1995లో రాంబంటు మూవీతో నటుడిగా మారారు. ఆ తరువాత కొండేటి ‘మహేశ్వరీ ఫిలిమ్స్’ అనే పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. ఎస్‌కె పిక్చర్ పేరుతో ప్రొడ్యూసర్ గా మారారు.
ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా, శంభో శంకర, డా. సలీమ్‌,లీసా, మహేష్, ప్రేమించాలి,)మెట్రో, జనతా హోటల్‌, లవ్ ఇన్ షాపింగ్ మాల్, క్రేజీ, ప్రేమలో పడితే, రేణిగుంట, రైడ్ చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, నటుడుగా రాణిస్తున్నారు. సురేష్‌ కొండేటి ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో 2004 నుండి ప్రతి ఏడాది తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. మొదట తెలుగు సినిమాలకు ఇచ్చేవారు. కొన్నేళ్ళ నుండి సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలకు సైతం అవార్డులు ఇస్తున్నారు.
ఈ ఏడాది 22వ సంతోషం ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ను గోవాలో నిర్వహించారు. సురేష్ కొండేటి 4 ఇండస్ట్రీల నుండి వచ్చిన నటీనటులు, సినీ బృందాలకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా కన్నడ సినీ ప్రముఖుల నుంచి కొండేటి పై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. సురేష్ కొండేటి చేసిన పొరపాట్ల వల్ల టాలీవుడ్ కి చెడ్డ పేరు వచ్చిందని, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి నుండి కొండేటిని తొలగించారు. అంతేకాకుండా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా కూడా సురేష్ కొండేటిని తొలగించారని తెలుస్తోంది.

Also Read: వైఎస్ రాజశేఖర్ రెడ్డితో “ప్రభాస్” దిగిన ఫోటో చూసారా..?


You may also like

Leave a Comment