కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నటులలో ఆయన ఒకరు. సూర్యకు కోలీవుడ్ లో ఎంత పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, టాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో ఉండడం విశేషం. అందువల్లే సూర్య చిత్రాలన్ని తమిళంతో పాటుగా కూడా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.
Video Advertisement
అయితే గత కొన్ని రోజులుగా సూర్య గురించిన వార్తలు నెట్టింట్లో షికారు చేస్తూనే ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా ఆయన తన తండ్రితో విడిపోయి వేరుగా ఉన్నారనే విషయం వైరల్ అవడం తెలిసిందే. తాజాగా మరోసారి సూర్య వార్తల్లో నిలిచారు. ఆయన ఫ్యామిలితో కలిసి ముంబైలో ఉండబోతున్నారని, అందుకోసం ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ కొన్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూర్య విభిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంటారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ అనే పాన్ ఇండియా మూవీతో పాటుగా మరి కొన్ని చిత్రాలతో సూర్య చాలా బిజీగా ఉన్నారు. కుటుంబ కలహాల నేపద్యంలో సూర్య తన కుటుంబంతో ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారనే వార్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో సూర్య ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారని, దాని ఖరీదు రూ. 70 కోట్లని తెలుస్తోంది.
సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లాట్ సుమారు తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని సూర్య, జ్యోతిక అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సూర్య కొనుగోలు చేశారని భావిస్తున్న ఫ్లాట్‌లో జిమ్, లైబ్రరీ, పార్కింగ్ స్పాట్, గార్డెన్ స్పేస్, స్విమ్మింగ్ పూల్, థియేటర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయని సమాచారం. ఆ ఫ్లాట్ ఖరీదు 68 కోట్లు, రూ.2 కోట్లు అపార్ట్‌మెంట్ బుకింగ్ మరియు ఇతర ఖర్చులు అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Also Read: “ఉగాది” స్పెషల్ గా OTT లో రిలీజ్ అవుతున్న 8 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?