ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే ఓటీటీ ల్లో ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Video Advertisement

అలాగే తెలుగు వారి తొలి పండగ అయిన ఉగాది కి పలు సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ద్వారా అభిమానుల‌కు పండుగ విందును అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలు, సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 అమెజాన్ ప్రైమ్

  • ప‌ఠాన్

షారుఖ్‌ఖాన్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ పఠాన్ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా హిందీ తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ugadhi special releases in OTT..
ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టించ‌గా జాన్ అబ్ర‌హ‌మ్ విల‌న్ పాత్ర‌ను పోషించారు.

#2 ఆహా

  • విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, కాశ్మీర జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది. ల‌వ్‌, యాక్ష‌న్, దేశ‌భ‌క్తి ఇలా మిక్స‌డ్ జోన‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ugadhi special releases in OTT..

#3 ఈటీవీ విన్

  • పంచతంత్రం

బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన పంచ‌తంత్రం సినిమా మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

ugadhi special releases in OTT..

  • రైటో.. లెఫ్టో..

ఈ తెలుగు సిరీస్ మొదటి సీజన్ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

#4 నెట్ ఫ్లిక్స్

  • వాకో : అమెరికన్‌ అపోకలిప్స్‌

ఈ ఇంగ్లీష్ మూవీ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

ugadhi special releases in OTT..

  • ది కింగ్ డం

ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ రెండో సీజన్ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • జానీ

ఈ ఇంగ్లీష్ మూవీ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.

  • ఇన్విజిబుల్ సిటీ

ఈ బ్రెజిలియన్ రెండో సీజన్ మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది.