సినీ పరిశ్రమలో కోట్ల రూపాయాలు సంపాదించి..చివరికి చేతిలో చిల్లి గవ్వలేక దుర్భరజీవితాన్ని గడిపిన సెలబ్రిటీలు కొందరున్నారు. హీరోలు.. నిర్మాత లు.. దర్శకులు… నటులు ఇలా ఒకప్పుడు లగ్జరీ లైఫ్ ని ఆస్వాదించి చివరికి వచ్చే సరికి మరో రకమైన జీవితాన్ని గడుపుతున్న విషయాలను మనం చూస్తున్నాం. అయితే తాజాగా తమిళ నిర్మాత వీఏ దురై అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత ఈ పరిస్థితి లో ఉండటం చూసి అందరు చలించిపోయారు.

Video Advertisement

 

 

సూపర్ స్టార్ రజినీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన వి. ఏ. దురై.. కొన్నాళ్లుగా మధుమేహం వ్యాధి బారినపడి దీనస్థితిలో ఉన్నారు. వైద్యం కోసం కనీస ఖర్చులు లేకపోవడంతో.. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న.. స్టార్ హీరో సూర్య.. నిర్మాత దురైకి వైద్యం నిమిత్తం రూ. 2 లక్షలు సాయం అందించాడు. అలాగే మరింత అవసరమైనా తాను సాయం చేసేందుకు సిద్ధమేనని తెలిపాడు. దీంతో సూర్య బాటలో ఇప్పుడు కోలీవుడ్ సెలబ్రిటీలు దురైకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు.

surya helps to a producer..

శివపుత్రుడు(పితామగన్) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దురై.. ఎన్నమ్మా కన్ను, వివరమనా ఆలు, లూఠీ, గజేంద్ర సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ.. శివపుత్రుడుతో వచ్చిన క్రేజ్ ని ఆ తర్వాత ప్లాప్స్ కారణంగా నిలుపుకోలేక ఆర్థికంగా ఇబ్బందులలో పడిపోయారు దురై. మధుమేహంతో బాధపడుతున్న దురై.. సొంత ఇల్లు లేక, వైద్యానికి చిల్లిగవ్వ లేక అవస్థ పడుతున్నట్లు ఆయన స్నేహితుడు కుమార్.. ఫేస్ బుక్ లో వీడియో ద్వారా తెలియజేసారు.

surya helps to a producer..

కెరీర్ లో ఆరంభంలో దురై ప్రముఖ నిర్మాత ఏఎం రత్ననాథ్తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో పనిచేశారు. అటుపై కొంత కాలానికి సొంతగా ప్రొడక్షన్ ఎవర్ గ్రీన్ ఇంటర్నేషనల్ సంస్థని స్థాపించారు. ఈ బ్యానర్ పైనే ఎన్నో సినిమాలు నిర్మించారు. దీంతో దురై కి హీరో సూర్యతో పాటు డైరెక్టర్ వెట్రిమారన్ ఆర్థికంగా సాయం చేశారని సమాచారం. దీంతో దురై పరిస్థితిపై ముందుగా స్పందించి సాయం అందించిన సూర్య మంచి మనసును అభినందిస్తున్నారు ఫ్యాన్స్.