ఈ ఆదివారం సూర్య గ్రహణం ఏర్పడనుంది పైగా అమావాస్య కావడంతో జ్యోతిష్య పరంగా ఈ సూర్యగ్రహణాన్ని ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుంది.ఈ సూర్య గ్రహణం ఉదయం 10 .12 గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం 11 :47 గంటలకు సంభవించనుంది.కాగా పూర్తి సూర్యగ్రహణం మధ్యాహ్నం 1 :30 కు ఏర్పడనుంది.అయితే జ్యోతిష్య పరంగా ఈ సూర్యగ్రహణం ప్రభావం ద్వాదశ రాశుల వారిమీద తీవ్ర ప్రభావం చూపుతుంది.అయితే ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇస్తుంటే కొన్ని రాశుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులను తీసుకురానుంది.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

మేష రాశివారికి మూడవ రాశి లో ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది.కాబట్టి తోబుట్టువులతో కొన్ని వివరాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూల ప్రవర్తనతో ఉండండి.అలాగే మీరు చేసే ప్రయత్నాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కానీ మునపటి కంటే ఉత్సహంగా పనులు చెయ్యడానికి ప్రయత్నించండి.

2020 మేష రాశి ఫలితాలు

వృషభ రాశి

వృషభ రాశివారికి రెండవ రాశి లో ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది.కాబట్టి కుటుంబంలో కొంచెం అశాంతి నెలకొంటుంది.అలాగే ఆర్ధిక పరంగా,వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.గొంతు కు సంబంధిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వేడి నీరు వంటివి తగి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

వృషభ రాశి ఫలితాలు 2020

మిధున రాశి

మిధున రాశివారికి తమ సొంత రాశిలోనే ఈ సూర్యగ్రహణం ఏర్పడడం వలన ఈ సూర్యగ్రహణం మిధునరాశి వారిపై తీవ్ర చెడు ప్రభావం చూపనుంది.మీకు వచ్చిన ఆలోచనల వలన నష్టపోతారు.విపత్తు ను కలిగించే ఆలోచనలు వస్తాయి కాబట్టి ఏదైనా కొత్త పనిని చేసేటప్పుడు మీ సన్నిహితుల సలహాలను పాటించండి.అలాగే టెన్షన్ కు లోనయ్యే అవకాశం ఈ మిధున రాశివారికి ఉంది కాబట్టి ధ్యానం చెయ్యడం చెప్పదగ్గ సూచన.

మిధున రాశి ఫలితాలు 2020

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈ సూర్య గ్రహణం 12 వ గదిలో ఏర్పడనుంది.కాబట్టి ఈ సూర్యగ్రహణం కర్కట రాశివారిపై చాలా చెడు ప్రభావం చూపనుంది.ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో నిరాశ,నిస్పృహ కు లోనవుతున్నారు.జీవితం లో ఏదో కోల్పోయినట్టు నిరాసక్తతను లోనవుతున్నారు.సుఖనిద్ర కరువు అవుతుంది.అలాగే మీ కొన్ని వస్తువులు ఇబ్బంది పెట్టడం వలన డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది.

కర్కాటక రాశి ఫలితాలు 2020

సింహ రాశి

సింహ రాశివారికి ఈ సూర్య గ్రహణం 11 వ రాశిలో ఏర్పడనుంది.అందరికంటే కూడా ఈ సూర్య గ్రహణం వలన మంచి ప్రయోజనాలను పొందుతుంది ఎవరూ అంటే మాత్రం సింహ రాశి జాతకులే అని చెప్పాలి.ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా కొన్ని కోరికలు నెరవేరతాయి.ఎప్పటినుండో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి.ప్రేమ,ఉద్యోగం,వ్యాపార విషయాలలో విజయాన్ని చూస్తారు.

సింహ రాశి ఫలితాలు 2020

కన్య రాశి

కన్య రాశివారికి ఈ సూర్య గ్రహణం 10 వ రాశిలో ఏర్పడనుంది.అయితే వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లారు.ఆకస్మిక ఉద్యోగ మార్పులు సంభవించే అవకాశం ఉంది.మీ ఉద్యోగ వాతావరణం మీకు అనుకూలంగా ఉండదు.

కన్యా రాశి ఫలితాలు 2020

తుల రాశి

తుల రాశివారికి ఈ సూర్య గ్రహణం 9 వ రాశిలో ఏర్పడనుంది.కాగా మీరు ఏదైనా దూర ప్రదేశానికి యాత్రలకు లేదా విహార యాత్ర కు వెళ్లే అవకాశం ఉంది.అయితే మీ తండ్రి ఆరోగ్యం మిమల్ని కొంత కలత పెట్టవచ్చు.అలాగే సాంప్రదాయ వ్యవరాలపట్ల ఆశక్తి పెరుగుతుంది.

తులా రాశి ఫలితాలు 2020

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి ఈ సూర్య గ్రహణం 8 వ రాశిలో ఏర్పడనుంది.అయితే ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం పుష్కలంగా ఉంది.వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి.అలాగే ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోండి.ఆకస్మికంగా డబ్బు పోయే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టడం ఆపడం మంచిది.అలాగే మీకు పెద్దల నుండి సంక్రమించాల్సిన ఆస్తులు తగాదాలతో ఇరుక్కునే అవకాశం ఉంది.

వృచ్చిక రాశి ఫలితాలు 2020

ధనస్సు రాశి

ధనస్సు రాశివారికి ఈ సూర్యగ్రహణం 7 వ రాశిలో ఏర్పడనుంది.అయితే ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం వలన సకల శుభాలు చేకూరే అవకాశం ఉంది.కాకపోతే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతె వివాదాలకు దారితీస్తుంది.అలాగే వివాహ జీవితంలో కూడా కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి కాబట్టి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎంతో అలోచించి మాట్లాడండి.

ధనుస్సు రాశి ఫలితాలు 2020

మకర రాశి

మకర రాశివారికి ఈ సూర్యగ్రహణం 6 వ రాశిలో ఏర్పడనుంది.అయితే రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది.అలాగే ఎదుటివారితో వివాదాలు కావడం,వివాహ జీవితంలో కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది.వీళ్ళయినంత వరుకు ఎదుటివారితో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి.అలాగే ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.

మకర రాశి ఫలితాలు 2020

కుంభ రాశి

కుంభ రాశివారికి ఈ సూర్యగ్రహణం 5 వ రాశిలో ఏర్పడనుంది.అయితే మీరు పిల్లలు పుట్టాడడానికి ఎదురుచూస్తున్నట్లైతే మీకు సంతానం కలగడానికి కాస్త ఆలస్యం అవుతుంది.అంతేకాకుండా మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.అలాగే మీకు ఉపయోగపడే ఆలోచనలు ఏవి కూడా మీకు ప్రస్తుతం రావు.

కుంభ రాశి ఫలితాలు 2020

మీనా రాశి

మీనా రాశివారికి ఈ సూర్యగ్రహణం 4 వ రాశిలో ఏర్పడనుంది.అయితే ఈ సూర్యగ్రహణం వలన మీనా రాశివారికి శుభాలు చేకూర్చేదిగా కనపడుతుంది.జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు.అలాగే వాహనాలు ,స్థిరాస్తులు కొనుగులో చేసే అవకాశం ఉంది.ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి ఫలితాలు 2020

Follow Us on FB:


Sharing is Caring: