మహిళల కోసం “మొబైల్‌ షీ టాయిలెట్‌”.. దీనివెనుక ఈమె పడిన కష్టం చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

మహిళల కోసం “మొబైల్‌ షీ టాయిలెట్‌”.. దీనివెనుక ఈమె పడిన కష్టం చూస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

దేశం ఎంత మోడరన్ గా మారుతున్నా.. ఆడవాళ్ళకి టాయిలెట్ ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. కొన్నిచోట్ల ఉన్నా అవి అంత పరిశుభ్రం గా ఉండకపోవడం, కొన్ని చోట్ల టాయిలెట్స్ ను నిర్మించే వెసులుబాటు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా అమ్మాయిలకు టాయిలెట్ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇక్కట్లను తీర్చడం కోసం తీసుకొచ్చిందే “మొబైల్ షీ టాయిలెట్”. ఇవి ఎక్కడకి అయినా వెళ్లిపోగలవు. వీటి గురించి మరింత వివరం గా ఈ కధనం లో తెలుసుకుందాం.

Video Advertisement

mobile toilets 1

సూర్యాపేట, కోదాడకు చెందిన భార్యాభర్తలు జలగం సుధీర్, కల్లెంపూడి సుష్మ అమెరికా లోని ఐటి కంపెనీ లో ప్రాజెక్ట్ మేనేజర్లు గా పనిచేసారు. వీరిద్దరూ ప్రస్తుతం సమాజానికి సాయం చేయాలనే ఉద్దేశ్యం తో తమ ఉద్యోగాలకు రిజైన్ చేసేసి.. ఇండియా కు వచ్చేసారు. ప్రస్తుతం సుధీర్.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని.. వాటిని ప్రమోట్ చేయడం కోసం ఓ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నారు.

mobile toilets 2

మరో వైపు సుష్మ కు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆమె చదువుకునే రోజుల్లోనే టాయిలెట్స్ లేక ఎంత ఇబ్బందిపడిందో గుర్తుకు వచ్చింది. అందుకే.. ఈ సమస్యకి పరిష్కారం గా మొబైల్ షీ టాయిలెట్స్ ను తీసుకురావాలని యోచించింది. నగరం లో కొన్ని లక్షల మంది నిరంతరం ఉద్యోగాల కోసం, చదువుల కోసం తిరుగుతూ ఉంటారు. ఈ పరిస్థితులలో టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం కూడా కష్టమే.

mobile toilets 3

ఎక్కడో లోపలి ప్రాంతాల్లో ఉన్నా.. వాటికి వెళ్ళడానికి సమయం పడుతూ ఉంటుంది. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ షీ టాయిలెట్లను రూపొందించారు. టాయిలెట్స్ ను ఆటో వంటి వాహనాల్లో అధునాతనం గా ఏర్పాటు చేసారు. వీటిని రద్దీ గా ఉండే ప్రాంతాల్లో పార్క్ చేస్తారు. అలాగే.. వీటి నిర్వహణ కూడా స్త్రీలే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయాలను మహిళలకు అందుబాటులోకి తీసుకురావడానికి సుష్మ కృషి చేస్తున్నారు.

mobile toilets 4

మరో వైపు, జీహెచ్ ఎమ్ సి, టీఎస్ ఆర్టీసీ వారు కూడా ఇలాంటి వాహనాలను తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటో రిక్షా వాహనాల్లో ఈ మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి తీసుకురావాలని సుష్మ యోచిస్తున్నారు. మరో వైపు ఆమె భర్త సుధీర్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ ప్రాజెక్ట్ లోనే ఉండడం తో.. ఆమె కు వీటిని తయారు చేయించడం తేలికగా పూర్తయింది. ఈ వాహనం లో ఫ్లష్, వాష్ బేసిన్, 100 లీటర్ల డ్రైనేజి సిస్టం ఉంటుందట. ఒక్కొక్క వాహనం తయారీకి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతోందట. అలాగే.. ఈ వాహనాలను గుర్తించడానికి జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్ లను కూడా ఏర్పాటు చేయాలనీ సుష్మ భావిస్తున్నారు.


End of Article

You may also like