స్వప్న శాస్త్రం ద్వారా పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మనం నిద్రపోయిన తర్వాత మనకి వివిధ రకాల కలలు వస్తూ ఉంటాయి. కల లో మనకి ఒక్కొక్క సారి భయంకరమైనవి కనబడుతూ ఉంటే ఒక్కొక్క సారి ఏదో సాధించినట్లు…

Video Advertisement

మనం దేనిలోనో గెలుపొందినట్లు కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క సారి భయంకరమైన పాములు లేదంటే ఎవరో తరుముతున్నట్లు కనబడుతూ ఉంటాయి.

పీడ కలలు కనుక వచ్చాయి అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కల లో ఇల్లు కనబడితే దానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క సారి మనకి కల లో ఇల్లు కూడా కనబడుతూ ఉండొచ్చు. కల లో కనుక ఇల్లు కనబడితే దానికి కారణం ఇదేనట. సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎక్కువగా మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటా మొ అటువంటివే మనకి కలలో కనబడుతూ ఉంటాయి. అలానే దేనికోసమైతే కష్టపడుతూ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటామో అవి కలలోకి రావడం సహజం. ఒకవేళ కనుక మీ కల లో ఇల్లు కనబడితే త్వరలో మీరు శుభవార్త వినబోతున్నారని అర్థం.

పైగా కలలో ఇల్లు కనపడితే మీ గౌరవం కూడా పెరుగుతుంది. కల లో ఇల్లు కనపడితే మీరు జీవిత భాగస్వామిని కూడా తర్వలో పొందొచ్చు అని అర్థం. కలలో ఇల్లు కనపడటం అశుభం కాదు. శుభమే. గౌరవం పెరగడం లేదంటే శుభవార్త వినడం ఇటువంటివి ఏమైనా జరగొచ్చు. అలానే భవిష్యత్తులో ఉద్యోగ మార్పులు కూడా రావచ్చని కూడా దీనికి అర్థం. మీ కల లో కూడా ఇల్లు కనబడితే జీవితం లో ఒక పెద్ద మార్పు రాబోతోందని ఆ కల వెనుక అర్థం. సో కల లో ఇల్లు కనపడితే కంగారు పడక్కర్లేదు.