స్విగ్గీ డెలివరీ బాయ్ కి ఎంత జీతం వస్తుందో తెలుసా..? ఆ ఇచ్చే జీతాన్ని ఎలా లెక్కిస్తారు అంటే..?

స్విగ్గీ డెలివరీ బాయ్ కి ఎంత జీతం వస్తుందో తెలుసా..? ఆ ఇచ్చే జీతాన్ని ఎలా లెక్కిస్తారు అంటే..?

by kavitha

Ads

స్విగ్గి గురించి తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ మరియు డెలివరీ ప్లాట్‌ఫారమ్.  కస్టమర్‌లను వారి స్థానిక రెస్టారెంట్‌లతో కనెక్ట్ చేస్తుంది. ఆగస్ట్ 2014లో మొదలైన స్విగ్గి క్రమంగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో స్విగ్గి ఒకటి.

Video Advertisement

అయితే స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పార్ట్ టైమ్ పని చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తమకు అనుకూలమైన సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి చాలామంది చూస్తున్నారు. అయితే డెలివరీ బాయ్‌ జీతం ఏనాట ఉంటుందో?  డెలివరీ బాయ్ ఒక ఆర్డర్‌కి ఎంత సంపాదిస్తాడు? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. పార్ట్ టైమ్ జాబ్స్ లో తమకు అనుకూలమైన సమయాలలో చేయగల జాబ్ లలో డెలివరీ బాయ్‌ జాబ్ ఒకటి. ప్రస్తుతం అనేక ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్  సంస్థలు ఉన్నాయి. వీటిలో స్విగ్గీ కూడా ఒకటి. ఇందులో డెలివరీ బాయ్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి పనివేళలు రాత్రి 7 గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మొత్తం పని గంటలు 5 గంటల 25 నిముషాల వరకు ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయాల్సి ఉంటుంది.
15 ఆర్డర్ల కు 750 రూపాయలు, 20 ఆర్డర్ల కు 1100 రూపాయలు, 25 ఆర్డర్ల కు 1500 రూపాయలు, 32 ఆర్డర్లు డెలివరీ చేసినట్లయితే 2000 రూపాయలు సంపాదించవచ్చు. ఎన్ని ఎక్కువ ఆర్డర్లు డెలివరీ చేస్తే అంత ఎక్కువ మనీ సంపాదించవచ్చు. సాధారణంగా స్విగ్గి పార్ట్ టైమ్ ఉద్యోగాల చేసేవారి జీతం రూ. 7000-15,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్‌ ఉద్యోగాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునవారికి, వారి అనుకూలమైన సమయాలలో చేసే అవకాశం ఉండడంతో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్‌ జాబ్ వైపుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.

Also Read: 1965 నాటి “హోటల్ బిల్” చూసారా..? అప్పటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?


End of Article

You may also like