BOOTCUT BALARAJU REVIEW : బిగ్‌బాస్ “సోహెల్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

BOOTCUT BALARAJU REVIEW : బిగ్‌బాస్ “సోహెల్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు ద్వారా పేరు సంపాదించుకున్న నటుడు సోహెల్. ఇప్పుడు సోహెల్ హీరోగా వచ్చిన బూట్‌కట్ బాలరాజు సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బూట్‌కట్ బాలరాజు
  • నటీనటులు : సయ్యద్ సోహెల్ రయాన్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ.
  • నిర్మాత : Md. పాషా
  • దర్శకత్వం : శ్రీ కోనేటి
  • సంగీతం : భీమ్స్ సిసిరోలియో
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024

bootcut balaraju movie review

స్టోరీ :

బాలరాజు (సోహెల్) ఉద్యోగం లాంటిది ఏమీ లేకుండా స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. బాలరాజు మహాలక్ష్మి (మేఘలేఖ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం తాను మారాలి అని నిర్ణయించుకుంటాడు. తాను మారాలి అని ఊరంతా తెలియాలి అనుకొని సర్పంచ్ ఎలక్షన్ లో గెలవాలి అనుకుంటాడు. అందుకే ఇంద్రావతి పటేల్ (ఇంద్రజ) కి పోటీగా ఎన్నికల్లో నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బాలరాజు ఎన్నికల్లో గెలిచాడా? సర్పంచ్ అయ్యాడా? మహాలక్ష్మి బాలరాజుని ప్రేమించిందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

bootcut balaraju movie review

రివ్యూ :

బిగ్ బాస్ ప్రోగ్రాం ఎంతో మందికి ఎన్నో రకాలుగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ ప్రోగ్రాం తర్వాత సినిమాల్లోకి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తమిళ్ బిగ్ బాస్ ప్రోగ్రాం తర్వాత అందులో పాల్గొన్న ఎంతో మంది నటులు, ప్రోగ్రాం తర్వాత ఇంకా పేరు తెచ్చుకొని హీరోలు అయ్యారు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో చేసిన వారు కూడా అలాగే వెలుగులోకి వస్తున్నారు. వారిలో సోహెల్ ఒకరు. బిగ్ బాస్ ప్రోగ్రాం తర్వాత సోహెల్ కొన్ని సినిమాల్లో నటించారు.

bootcut balaraju movie review

ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. పాపులారిటీ రావడం అనేది మంచి విషయం. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవడం అనేది మాత్రం ఆలోచించాలి. సోహెల్ మంచి నటుడు. ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతారు. కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకోవడం కూడా ముఖ్యం. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ మనం ఎన్నో సార్లు చూసాం. టేకింగ్ పరంగా కూడా కొత్తగా ఉందా అంటే, అది కూడా చాలా చోట్ల రొటీన్ గానే అనిపిస్తుంది. సోహెల్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేశారు.

bootcut balaraju movie review

కానీ రొటీన్ కథని కొత్తగా చూపించడంలో దర్శకుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిందేమో అనిపిస్తుంది. సినిమాలో తెలిసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. వాళ్లందరూ ఇలాంటి పాత్రలు అంతకుముందు పోషించిన వారు. కాబట్టి ఈ పాత్రల్లో వాళ్ళని చూడడం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఇంద్రజకి చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. కామెడీ ట్రై చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పాటలు సినిమాకి తగ్గట్టు అలా వెళ్ళిపోతాయి అంతే. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. కంటెంట్ పరంగా ఇంకా కొంచెం బలంగా ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సోహెల్ నటన
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • బలహీనమైన స్క్రీన్ ప్లే

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏమీ లేదు. కేవలం సోహెల్ కోసం, సోహెల్ నటన కోసం సినిమా చూద్దాం అని అనుకునే వారికి బూట్‌కట్ బాలరాజు సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : చాలా మంది తెలుగు హీరోయిన్స్ కంటే ఈ అమ్మాయి బాగా నటిస్తుంది ఏమో..! ఈమె ఎవరంటే..?


End of Article

You may also like