HEART STROKE SYMPTOMS: ఈ 3 లక్షణాలు గుండె సమస్యకు సూచన .. అశ్రద్ధ చేయకండి..

HEART STROKE SYMPTOMS: ఈ 3 లక్షణాలు గుండె సమస్యకు సూచన .. అశ్రద్ధ చేయకండి..

by kavitha

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె కూడా ఒకటి. నిరంతరం ఎటువంటి విశ్రాంతి లేకుండా పని చేసే గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాము. మనకు తెలియకుండా శరీరంలోని ముఖ్యమైన భాగంలో సమస్య ఏర్పడినప్పుడు.. దీనికి సంబంధించిన లక్షణాలు మనకు ముందుగానే తెలుస్తాయి. మన శరీరం వీటిని మనకు అర్థమయ్యేలా ఏదో ఒక రూపంలో సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..

Video Advertisement

సాధారణంగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఛాతి చుట్టూ నొప్పి వస్తుంది అనుకుంటాం కానీ ముందుగా మనకు సూచన వచ్చేది కాళ్ళ దగ్గర నుంచి అని చాలా మంది కి తెలియదు. మీరు మీ పాదాలలో ఈ క్రింది సమస్యలు గమనించినట్లయితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.

పాదాల రంగు..

గుండె సరిగ్గా పనిచేయనప్పుడు మన శరీర భాగాలకు అవసరమైన రక్తప్రసరణ జరగదు. దీంతో చర్మం అక్కడక్కడ నీలిరంగులోకి మారుతుంది. ముందుగా ఈ మార్పు మనకు కనిపించేది మన పాదాలలోనే.

బలహీనమైన పాదాలు..

కాళ్లు బలహీనంగా నీరసంగా అనిపిస్తున్నా ..ఎక్కువ దూరం నడవలేకపోతున్నా.. కాస్త శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. రక్తం సరిత ప్రవహించకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తరచూ తలెత్తుతాయి కాబట్టి ..ఇలా తరచూ అనిపిస్తూ ఉంటే గుండె ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని.

కాళ్ళ నొప్పి..

కాళ్ల నొప్పి అనేది సర్వసాధారణ సమస్య ..కానీ చాలా సందర్భాలలో ఇది గుండె పనితీరు మందగించడాన్ని సూచిస్తుంది. గుండె జబ్బు ఉన్నవారు తరచూ కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.


You may also like

Leave a Comment