weekly horoscope in Telugu 2023: రాశి చక్రంలోని 12 రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? ఎవరికి శుభం జరుగుతుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది, ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలలో తెలుసుకుందాం.
Weekly Horoscope in Telugu: ఈ వారం రాశి ఫలాలు 08-01-2023 to 14-01-2023
ఎవరికి కలిసి వస్తుంది, ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలలో తెలుసుకుందాం.
ఈ వారం మేషం రాశి ఫలాలు 08-01-2023 to 14-01-2023
రోజు వారి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బందు వర్గంతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు.
ఈ వారం వృషభం రాశి ఫలాలు 08-01-2023 to 14-01-2023
పని భారం పెరుగుతుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక సమస్యలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి.
ఈ వారం మిథునం రాశి ఫలాలు 08-01-2023 to 14-01-2023
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సమాజంలో మంచి స్థితిలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
ఈ వారం కర్కాటకం రాశి ఫలాలు 08-01-2023 to 14-01-2023
మెరుగైన ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అయితే, ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలుపడతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
సింహం
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. పని భారం పనిభారం పెరిగిన అందుకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది.
కన్య
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత వ్యక్తిత్వం కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంతో అనుబంధం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించండి.
తుల
పనులు నెరవేరుతాయి. బంధువుల సహకారం పొందుతారు. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. పాత బాకీలు పాక్షికంగా వసూలు అవుతాయి. ఆర్థికంగా సర్దుబాటులో అవసరమేర్పడవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం ఉంటుంది.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాధాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగులతో, పై అధికారులతో అభిప్రాయ బేధాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
మకరం
ఉద్యోగులకు సానుకూల వాతావరణం. అధికారులు, సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువు బాధ్యతలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థ విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కుంభం
రావాల్సిన డబ్బు పాక్షకంగా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలను సకాలంలో ఆచరణలో పెడతారు. సంతృప్తిగా ఉంటారు.
మీనం
రోజు వారి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు.
Also Read: HOROSCOPE TODAY TELUGU: నేటి రాశిఫలాలు ఈ రోజు అనగా 08.01.2023