Horoscope Today Telugu: ఈరోజు మేష,వృషభ రాశులకు మంచి ఫలితాలు. మిగతా రాశులకు ఎలా ఉందంటే..?

Video Advertisement

మన భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎక్కువ. ఏ పని చేయాలన్నా, శుభకార్యాలు, చేసుకోవాలన్న ముందుగా జ్యోతిష్యుని సంప్రదించి వారి రాశుల ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం .

మేష రాశి ఫలాలు 2023:

ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయట. వీరి పనులకు సంబంధించి ఉదయం నుంచే బిజీగా ఉంటారు. వీరు దూర ప్రయాణం చేయవలసి రావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీ క్రిష్ణుడికి వెన్న, పదార్థాలను సమర్పించాలి.

Horoscope Today in Telugu : 08.01.2023

వృషభ రాశిఫలాలు 2023

ఈ రాశి వారికి మంచిగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. దీని వల్ల ఆనందంగా ఉంటారు. పాత బకాయిలన్నీ తిరిగి రావొచ్చు. ఈరోజు 80% వరకు అదృష్టం లభిస్తుంది. గోమాతకు రోటిని తినిపించడం మంచిది.

మిధున రాశిఫలాలు 2023:

ఈ రాశికి చెందినవారికి ఈరోజు కలిసివస్తుంది.మీ కుటుంబీకులు సహాయం చేస్తారు. మీ పనులకు సంబంధించి శుభ ఫలితాలను పొందుతారు. సకాలంలో పనులను పూర్తవుతాయి.93% వరకు అదృష్టం లభిస్తుంది. సూర్య భగవానుడికి నీరు సమర్పించి, రవి చాలీసా చదవాలి.

కర్కాటక రాశి ఫలాలు 2023:

ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉదయం నుండే కొన్ని కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదన రావొచ్చు. వ్యాపారులకు కలిసి వస్తుంది. 99 % వరకు అదృష్టం లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయాలి.

సింహ రాశిఫలాలు 2023:

ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. హెల్త్ పరంగా ప్రతికూలంగా ఉంటుంది. పని విషయంలో చాలా బలంగా ఉంటారు. మీ ఆలోచనే మిమ్మల్ని ఇతరుల ముందు ఉంచుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించాలి.

కన్య రాశి: ఈ రాశికి చెందినవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. తులసి చెట్టుకు నీళ్లు సమర్పించి, దీపారాధన చేయాలి.

తుల రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ఆలోచనలను శ్రేయోభిలాషులతో పంచుకుంటారు. వివాహితులు ఒక విషయంలో ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామితో సమన్వయం ఉండదు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

Today Rashi Phalalu in Telugu : 08.01.2023

వృశ్చిక రాశి: ఈ రాశి వారు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఊహించని పనిని చేసేందుకు ప్రయత్నిస్తారు. 88% వరకు అదృష్టం లభిస్తుంది. గురువు లేదంటే సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. నిజాయితీని ప్రదర్శించి అవకాశాలు పొందుతారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. మీ రక్తసంబంధీకులతో సంబంధాలు మెరుగవుతాయి. మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఓ శుభకార్యం గురించి పెద్దలతో చర్చిస్తారు. పిండి పదార్థాలను చేపలకు తినిపించాలి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు చాలా సానుకూలం. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగులకు పనిచేసే ఆఫీసులో సహోద్యోగులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా ముఖ్యమైన పనుల్లో మీరు విజయం సాధిస్తారు. 71% వరకు అదృష్టం లభిస్తుంది. మందార పువ్వును నీటిలో కలిపి సూర్యభగవానుడికి సమర్పించాలి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. భూమి కొనుగోలు గురించి చర్చ జరపొచ్చు. ఆదాయం బాగుంటుంది. కానీ శుభకార్యాల కొరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించాలి.

మీన రాశి :ఈ రాశి మిశ్రమ ఫలితాలను పొందుతారు. పనులకు సంబంధించి మంచి ఫలితాలొస్తాయి. మీ మనసులో ఏదో ఒక విషయం పై ఆందోళన చెందవచ్చు. రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

Also Read: ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!