బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపదించుకున్నాడు విజే సన్ని. ఆ క్రేజ్ తోనే పలు సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే సన్నీ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా నిరాశ చెందకుండా ఇప్పుడు మళ్ళి సౌండ్ పార్టీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం…!
- చిత్రం: సౌండ్ పార్టీ
- నటీనటులు: విజే సన్ని,హృతిక,శివ నారాయణ, ఆలీ, సప్తగిరీ,పృధ్వీ,మిర్చి ప్రియ,రేఖ తదితరులు.
- దర్శకుడు: సంజెయ్ షేరి
- నిర్మాతలు: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర.
- సంగీతం: మోహిత్ రెహమానిక్.
- కెమెరా: శ్రీనివాస రెడ్డి
- విడుదల తేదీ: నవంబర్ 24.
కథ:
మధ్యతరగతి కుటుంబానికి చెందిన డాలర్ కుమార్ (విజే సన్ని) ఆయన తండ్రి కుబేర్ కుమార్ (శివనారాయణ) కోటీశ్వరులు కావాలని కలలు కంటు రకరకాల బిజినెస్ లు చేస్తూ నష్టపోతు ఉంటారు.చివరికి సేటు నాగభూషణం(నాగిరెడ్డి) వద్ద అప్పు తీసుకుని గోరుముద్ద అనే హోటల్ ప్రారంభిస్తారు. హోటల్ ఆరంభంలో బాగానే నడిచిన డాలర్ కుమార్ ప్రియురాలు సిరి( హృతిక శ్రీనివాస్)తండ్రి దాన్ని చెడగొడతాడు.
మళ్లీ రోడ్డున పడి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అయితే అప్పుడు ఎమ్మెల్యే వరప్రసాద్ (పృథ్వి) కొడుకు చేసిన నేరాన్ని తమ మీద వేసుకుని జైలుకు వెళ్తే రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ వస్తుంది. డబ్బుకి ఆశపడి జైలుకెళ్ళిన వీరు తర్వాత ఏమయ్యారు? ఎమ్మెల్యే కొడుకు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష నుండి ఎలా తప్పించుకున్నారు? కోటీశ్వరులు కావాలనే కల నెరవేరిందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
కష్టపడకుండానే కోటీశ్వరులు అయిపోవాలనుకునే ఒక ఫ్యామిలీ స్టోరీ ఇది. తెలుగులో ఇలాంటి తరహా కథలు చాలా వచ్చాయి. బిట్ కాయిన్ అనే పాయింట్ తో కామెడీ పండించడమే ఈ కథలో ఉన్న కొత్త. లాజిక్కులన్నీ పక్కన పెట్టేసి కేవలం కామెడీ మీద దర్శకుడు ఫోకస్ చేశాడు. కొన్ని సన్నివేశాలు బాగానే నవ్వించినప్పటికీ కొన్ని తేలిపోయాయి.అయితే హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సీన్స్ మాత్రం అతికినట్టుగా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ నువ్వులు పూయిస్తుంది.విజే సన్నీ,శివనారాయణ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన హైలెట్ గా నిలిచాయి.వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ పాత్ర బాగానే ఉంది. తెరపై అందంగా కనిపించింది. కాకపోతే నిడివి బాగా తక్కువ.
ఆలీ కొద్దిసేపు నవ్విస్తాడు. ఎమ్మెల్యే గా పృథ్వి క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. మిగతావారు ఎవరి పాత్రలకు తగ్గట్టు వారి నటించారు. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. మోహిత్ రెహమాన్ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బానే కుదిరింది.
ప్లస్ పాయింట్స్:
- మెయిన్ లీడ్స్ యాక్టింగ్
- కామెడీ
- బిట్ కాయిన్ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ, కథనం
- లాజిక్ కి అందని సీనులు
రేటింగ్:
2.5/5
ట్యాగ్ లైన్:
పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కామెడీని ఇష్టపడేవారు ఈ సినిమాని చూడొచ్చు.
Watch Trailer:
Also Read: AADIKESHAVA REVIEW : “వైష్ణవ్ తేజ్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!