Tollywood: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రాల తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినిమా స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఏడాది మార్చిలో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ సందడి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్‌గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్‌లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
film news
Superstar Krishna: ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను దుఖంలోకి నెట్టింది. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కుమారుడు మహేష్ బాబు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయనకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.
ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్‌కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.
Waltair Veerayya: వాల్తేర్ వీరయ్య “బాస్ పార్టీ” వీడియోలో.. హైలైట్ అవ్వనున్న విషయాలు ఇవేనా?
Tollywood: మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మొదటి పాటగా ‘బాస్ పార్టీ’ని విడుదల చేశారు. మెగాస్టార్ ఈ పాటలో తన డాన్స్ తో దుమ్ములేపారు. సహజంగానే మెగాస్టార్ చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కలయిక అంటే మోత మోగిపోవడం ఖాయం అని తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన శంకర్‌దాదా ఎంబీబీఎస్,శంకర్‌దాదా జిందాబాద్ పాటలో ఇప్పటికీ ఫేవరేట్. మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. చాలా గ్యాప్ తరవాత వీరిద్దరి కలయికతో మరో మాస్ పాట వచ్చింది.
మెగాస్టార్ నుంచి చాలా కాలం తరవాత అదిరిపోయే మాస్ సాంగ్ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్.ఇక మెగాస్టార్ చిరంజీవి అంటేనే అందరికీ ముందుగా గుర్తుచ్చేది డాన్స్. చిరంజీవి స్టెప్పులేస్తుంటే థియేటర్లలో జనాలు లేచి ఆడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మెగాస్టార్ నుండి అలాంటి పెర్ఫార్మెన్స్ రాలేదనే చెప్పాలి. ఆ లోటు తీర్చడానికి అన్నట్టుగా ‘బాస్ పార్టీ’ మంచి మాస్ బీట్ సాంగ్‌తో వచ్చారు చిరంజీవి. ఆయన నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’మూవీలో ‘బాస్ పార్టీ’ అంటూ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిన్న విడుదలైంది. ఈ పాటకు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి దేవి పాడారు.
ఇటీవలే విడుదలైన ‘బాస్ పార్టీ’ పాట ప్రోమో ఆసక్తిని పెంచింది. అయితే పాట కోసం వేసిన సెట్స్, చిరంజీవి వేసుకున్న కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ పాటను చూసి బాస్ దుమ్ములేపేశాడు అని సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ పాటలో మరో ఆకర్షణ ఊర్వశి రౌతెలా. ఈ బాలీవుడ్ హీరోయిన్ మొదటిసారి తెలుగులో ప్రత్యేక గీతం చేసింది.. మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది. ఈ మాస్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
సినిమాకి సంబంధం లేకపోయినా.. ఆ పాట ఎందుకు..? “వీర సింహా రెడ్డి” పై కామెంట్స్..!
Tollywood: బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ నుంచి బుధవారం న్యూ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ‘రాజసం నీ ఇంటిపేరు’ అని కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో వదిలారు. దీనిలో బాలయ్య వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
అయితే ఈ పోస్టర్ లో ‘జై బాలయ్య’అనే పాటను నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇక్కడే చాలామందికి ఒక పాట ఎందుకు పెట్టినట్టు అని సందేహం వచ్చింది. జై బాలయ్య అనేది సినిమాలో హీరో పేరు కాదు. పోనీ సినిమా పేరనుకుంటే అది కూడా కాదు. మరి ఈ జై బాలయ్య పాటను ఎందుకు పెట్టరా అని అనుకుంటున్నారు. ఇపుడే కాదు ఇంతకు ముందు అఖండ మూవీలో కూడా జై బాలయ్యతో ఒక పాట పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఇటు మెగాస్టార్ అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు వరుస అప్డేట్స్ ఇచ్చారు. నిన్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి ‘బాస్ పార్టీ’ పాటను విడుదల చేశారు. ఇంకో రెండు రోజుల్లో ‘వీరసింహారెడ్డి’ నుండి ‘జై బాలయ్య’ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం ఒక అప్డేట్ ఇచ్చింది. ‘రాజసం నీ ఇంటిపేరు’ అనే ఒక కొత్త పోస్టర్‌ను వదిలింది. బాలయ్య ఈ పోస్టర్లో వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది. బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ రాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతోంది. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మైత్రీ మేకర్స్ ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇస్తూ మూవీ పై అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు. ‘జై బాలయ్య’నవంబర్ 25న ఉదయం 10:29 గంటలకు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ‘రాజసం నీ ఇంటి పేరు’ అని పేర్కొంటూ నిర్మాతలు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్‌గా కనిపించారు బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’ టైమ్‌లో బాలయ్యలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A MASS ANTHEM for the GOD OF MASSES 🔥#VeeraSimhaReddy first single #JaiBalayya on November 25th at 10.29 AM ❤️🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/nYGn2dVRTv
— Mythri Movie Makers (@MythriOfficial) November 23, 2022
విశ్వక్ సేన్ కావాలనే ‘హిట్2’ ని పక్కన పెట్టాడా? అడివి శేష్ కామెంట్స్..!
Tollywood: అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘హిట్2’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి సీక్వెల్ గా ‘హిట్ 2’ వస్తోంది. ఈ సినిమా నాచురల్ స్టార్ నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘హిట్’ కాంబినేషన్లోనే ఈ సినిమా రూపొందింది. కానీ ఇందులో హీరో హీరోయిన్లు మాత్రమే మారారు.
హిట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుహాని శర్మ నటించారు. హిట్2 లో అడివి శేష్, మీనాక్షి చౌదరి నటించారు. అయితే హీరోయిన్ సంగతి ఎలా ఉన్నప్పటికీ హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన విశ్వక్ ను హీరోగా మళ్ళీ ఎందుకు తీసుకోలేదు అనే సందేహం మాత్రం అందరిలోను కలిగింది. అయితే హిట్ సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో చేయాలని, తీసే ప్రతీ సీక్వెల్ కి హీరోని మార్చాలనే విశ్వక్ ను కాకుండా వేరే హీరోను తీసుకున్నట్లు డైరెక్టర్ శైలేష్ చెప్పుకొచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హిట్’. హీరో నాని నిర్మాతగా మారిన ఈ సినిమాతోనే శైలేష్ కొలను దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అయితే శైలేష్ కొలను ఒక డాక్టర్.ఆయనకు సినిమాలపై ఉన్న అమితమైన ఆసక్తి వల్ల దర్శకుడు అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.
అయితే విశ్వక్ సేన్ కు ‘హిట్2’ కథ నచ్చకపోవడం వల్లే ఈ సినిమాలో నటించలేదని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ శైలేష్ ‘హిట్3’మూవీని కూడా అడివి శేష్ తోనే చేయబోతున్నాడు. అయితే ఈ విషయాన్నిహీరో అడివి శేష్ స్వయంగా తెలిపాడు. అడివి శేష్ నిన్న జరిగిన ‘హిట్2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పాడు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ దర్శకుడు శైలేష్‌కి, మూవీ యూనిట్ అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్ అని, ట్రైలర్ ని ఇంత బాగా కట్ చేసినందుకు శైలేష్ గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో సెకండ్ పార్ట్ చాలా కీలకమైంది.
‘హిట్ 3’ లో కూడా నన్ను భాగం చేసినందుకు శైలేష్‌కు థాంక్స్. అయితే నార్త్ ఆడియెన్స్ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని అడిగేవారు. అందుకే నిర్మాత నాని గారితో మాట్లాడి, పాన్ ఇండియన్ వైడ్‌గా విడుదల చేయాలని నిర్ణయించాం. ఆడగగానే అంగీకరించిన నాని గారికి, ప్రశాంతి గారికి చాలా థాంక్స్. మరియు నాతో ఈ మూవీని నిర్మించినందుకు థాంక్స్ అని చెప్పారు.ట్రైలర్ లో ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంది. హీరోయిన్ మీనాక్షి గారు చాలా చక్కగా నటించారు. శ్రద్దా శ్రీనాధ్ గారు అద్భుతంగా నటించారు.
మేజర్‌లో చేసిన పాత్రకు ‘హిట్ 2’లో చేసిన పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు.ఒకరి కోసం కాకుండా కథ, డైరెక్టర్, నిర్మాత నాని అందరి కోసం ఈ మూవీని చేశాను. డిసెంబర్ 2న హిట్ 2 విడుదల కాబోతుంది. అయితే అడివి శేష్ ‘హిట్3’ గూర్చి చెప్పాడు. కానీ,ఇప్పుడు శేష్ ఇచ్చిన స్పీచ్ తో ‘విశ్వక్ సేన్ తన ఇగో వల్లే హిట్ 2లో చేయలేదా? అనే సందేహాలను రేకెత్తించాడు. అసలు విషయం ఏమిటో తెలియాల్సి ఉంది..
సూపర్ స్టార్ “మహేష్ బాబు” గురించి ఈ సీక్రెట్ అస్సలు తెలియదుగా..? ఇన్నేళ్ల తర్వాత బయటికి వచ్చిన అసలు విషయం..!
ప్రేక్షకులు తమ అభిమాన నటీనటుల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులోను వారు ఎలాంటి కార్లు వాడుతున్నారు, ఏ వస్తువులు వాడుతారు, ఏ విధమైన బట్టలు ధరిస్తున్నారు,వారు వేసుకునే బట్టల ధర ఎంత, ఏ బ్రాండ్ వాచీలు, మొబైల్స్,వాటి ఖరీదు ఎంత ఇలా ఆన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇంకా చెప్పాలంటే వారి జుట్టు నిజమైన జుట్టేనా లేదా విగ్గులు వాడుతున్నారా అనే డయని పై కూడా ఆసక్తి చూపిస్తుంటారు.ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒరిజినల్ జుట్టేనా? లేక విగ్గు వాడుతున్నారా అన్న అనుమానం చాలా మందిలో కనిపిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణకు మేకప్ మ్యాన్ చేబ్రోలు మాధవరావు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో ఆయన మేకప్ మ్యాన్ ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఆయన సూపర్ స్టార్ కృష్ణకు చాలా కాలం మేకప్ మ్యాన్ గా పని చేసారు.
ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ జుట్టు నిజమైన జుట్టేనా? లేక విగ్గా అని అడిగినపుడు ఆయన చాలా కాలం పాటు నిజమైన జుట్టుతోనే సినిమాలు చేస్తూ వెళ్లారని, ఆ తర్వాత జుట్టు పలుచగా అవ్వడం వల్ల విగ్గు వాడడం మొదలుపెట్టారని చెప్పారు. అనంతరం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు జుట్టు గురించి అడిగినపుడు మొదట్లో మహేష్ కూడా విగ్గు లేకుండానే నటించేవారు.జుట్టు రాలడం మొదలైన తరువాత విగ్గు వాడడం మొదలుపెట్టినట్లు తెలిపారు. మహేష్ బాబు ఆ తర్వాత హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నట్లు సమాచారం.హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు. ఇది నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం అని సమాచారం. ఇలా చేయించుకున్న జుట్టు చూడటానికి సహజమైన జుట్టు లాగానే కనిపిస్తుందంట. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు ఈ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారని సమాచారం.
Tollywood: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ చిత్రం గత శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బి, సి సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. గాలోడు విడుదలైన మొదటి రోజునే రూ.1.01 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.2 కోట్ల మార్క్‌ని కూడా దాటేసినట్లు సమాచారం. సుడిగాలి సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తదితర ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకి బాగా చేరవై, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.
సుధీర్ గాలోడు మూవీకి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్లో ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలలు పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరంగా ఉన్న సుడిగాలి సుధీర్ యాబై లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. నిజానికి టివి షోల నుండి వచ్చిన సుధీర్‌కి గాలోడు రెండో సినిమానే. అతని తొలిచిత్రం ‘సాప్ట్వేర్ సుధీర్’కి కూడా రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది.
గాలోడు సినిమాకి సాప్ట్వేర్ సుధీర్ మూవీతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్తున్నాయి రివ్యూలు. ఈ సినిమాలో సుధీర్‌కి బాగా ఎలివేషన్స్ పడ్డాయి. అయితే కథ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసుంటే బాగుండని అని విమర్శకుల అభిప్రాయం. బుల్లితెర నుంచి వచ్చిన నటుడికి యాబై లక్షలు అంటే భారీ రెమ్యూనరేషన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tollywood: నటసింహం నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తూనే, ఇంకో వైపు 108వ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే కథా చర్చలు జరిగాయి. అనిల్ రావిపూడి ఆర్టిస్ట్‌ల సెలెక్షన్ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో ఇంతకుముందు బాలయ్యతో నటించిన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా, పెళ్లిసందD శ్రీలీల నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ విషయంలో చాలా కొత్తగా , యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేటట్లు ఉండేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘వీరసింహా రెడ్డి’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ చివరి దశకి చేరుకోవడంతో, బాలకృష్ణ తన 108వ సినిమా పనిలో పడ్డారు.అయితే బాలయ్య ఇప్పటికే 108వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు. సమాచారం ప్రకారం డిసెంబరు 8న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా ఇదే.
NBK108లో బాలకృష్ణ ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపిస్తారని టాక్. ఇందులో 45 ఏళ్ల వయసు ఉన్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని, జైలు నుంచి విడుదలయ్యే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా, కూతురుగా పాత్రలో యంగ్ హీరోయిన్ హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్. అయితే బాలకృష్ణ కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతునట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హారిష్ పెద్ది నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే అనిల్ రావిపూడి తమన్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే. బాలకృష్ణ అఖండ మూవీకి తమన్ ఇచ్చిన సంగీతం ఆ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యని సరికొత్త యాంగిల్లో చూపించబోతున్నట్లు చెప్పారు.
అనిల్ రావిపూడి ఈ సినిమాకి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా ఫిలిమ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ కూడా ఈ టైటిల్ పై హింట్ కూడా ఇచ్చాడు. బాలకృష్ణ, తనని బ్రో అని ఫోన్లో పిలిచినట్లు విశ్వక్ సేన్ ‘దాస్ కా దమ్కీ’చిత్ర ట్రైలర్ లాంచ్ వేదిక పై చెప్పుకొచ్చాడు.కానీ తాను మాత్రం బాలయ్యని తిరిగి బ్రో అని పిలవలేకపోయినట్లు విశ్వక్ సేన్ తెలిపాడు. అనిల్ రావిపూడి ‘బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్‌ని బాలయ్యకి చెప్పినట్లు తెలుస్తోంది.అందులోనూ అనిల్ రావిపూడి మూవీ టైటిల్స్ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.అనిల్ రావిపూడి సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-2, ఎఫ్-3 విభిన్నాంగా ఉంటాయి.
సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆ పాత్రకు తగ్గ నటులని ఎంచుకోవడం. ఒకవేళ ఆ పాత్రకి ఆ యాక్టర్ న్యాయం చేసేలాగా నటిస్తే, యాక్టర్ కి మంచి పేరు రావడం మాత్రమే కాకుండా పాత్ర కూడా తెరపై చాలా బాగా కనిపిస్తుంది.
పాత్ర కోసం నటీనటుల గెటప్ మార్చడం అనేది చాలా సహజం. కానీ కొన్ని సార్లు మాత్రం అంత చేయాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్.దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. అయితే అందులో హీరోయిన్ ని టాన్ చేసి చూపించారు. ఆ టీజర్ చూసిన వారు అదేంటి ఆమెని అలా చూపించారని అంటున్నారు. కానీ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. పూర్తి కథ తెలియదు కాబట్టి ఇప్పుడు విడుదల అయిన టీజర్ మీద మాత్రమే కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఒకసారి మన భారతీయ సినిమాలని పరిశీలిస్తే, ఇలాంటివి అంతకు ముందు చాలా జరిగాయి. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలలో అందంగా ఉన్న కథానాయకలను ఇలాగే చూపించారు.
ఫ్యామిలీ మ్యాన్ లో సమంతను, అలాగే పుష్ప సినిమాలో రష్మికను కూడా అలానే టాన్ చేశారు. సమంత మంచి నటి. అందులో కామెంట్ చేయడానికి ఏమీ లేదు. అందులో సమంత నటన పరంగా కాదు యాక్షన్ పరంగా బాగా చేశారు అని కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే సమంత పాత్ర చాలా వరకు సీరియస్ గానే ఉంటుంది. ఈ పాత్ర కోసం సమంత స్టంట్స్ నేర్చుకుని చాలా కష్టపడ్డారు. అలాగే ఈ పాత్ర కోసం సమంతని నల్లగా చూపించారు.
దాని బదులు అదే కలర్ తో ఉన్న, బాగా నటించగలిగే నటి అయిన ఐశ్వర్య రాజేష్ కానీ, లేదా మరొకరిని కానీ తీసుకొని, అలాగే వారు కూడా స్టంట్స్ నేర్చుకుని చేస్తే అది కూడా బానే ఉండేది కదా అని అప్పట్లో బాగా కామెంట్లు వచ్చాయి. ఐరా మూవీలో నల్లగా అంధవికారంగా ఉండటంతో నష్టజాతకురాలు అనే ముద్రను వేసి సమాజంలో చీత్కారాలు ఎదుర్కొనే పాత్రలో నయనతారను చూపించారు. నష్ట జాతకురాలు అని చూపించడం వరకు బానే ఉంది.
కానీ కలర్ మార్చాల్సిన అవసరం ఏముంది. అయిన ఇది ఇప్పుడు మొదలైంది కాదు. పాత సినిమాలలో కూడా ఇలాంటివి ఉండేవి. ఊర్వశి చిత్రంలో అప్పటి పాపులర్ నటి శారద ద్విపాత్రాభినయం చేసిన పాత్రల్లో ఒక పాత్ర అలాగే టాన్ చేసి చూపించారు. మళ్లీ ఆ పాత్రని సినిమాలో కామెంట్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఆ పాత్రకి అది అవసరం అని అనుకుందాం. కానీ మంచి పాత్రల్లో కూడా అలాగే ఒక తెల్లగా ఉన్న నటిని ఇలా కలర్ మార్చి చూపించాల్సిన అవసరం ఏముంది. అలాంటి పాత్రలు ఉన్నప్పుడు, అలాంటి ఛాయ ఉండి, బాగా నటించగల హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, రాధికా ఆప్టే వంటి నటీమణులను ఎంచుకోవచ్చు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్ర అలాంటిదే. అదే కాకుండా కలర్ ఫోటోలో సుహస్ చేసిన పాత్ర. వాళ్లీద్దరు ఆ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. గెటప్ మార్చడం వరకూ సరే, కానీ సహజంగా ఉండే మనిషి కలర్ కూడా మరి ఒరిజినల్ కలర్ కి ఆపోజిట్ గా చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? ఆ కలర్ లో ఉండి బాగా నటించక కలిగే నటులు చాలా మంది ఉన్నారు కదా? పాత్రకు తగ్గ వారిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, ఒక రంగులో ఉన్న వారి ఛాయను తగ్గించి చూపించాల్సిన అవసరం ఏముంది? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.