Horoscope Today 15 July 2021: రాశి ఫలాలు తెలుగు Horoscope Today 15 July 2021 ఇవాళ ఏ ఏ రాసి వారికి ఎలా ఉందొ చూద్దాం. వారు చేయవలసిన పనులు, చేప్పట్టవలసిన జాగ్రత్తలు చూద్దాం.
- మేష రాశి: మీరు చేయవలసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులని కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారరంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రొమోషన్ లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఆలోచనలను పెరుగుతాయి.
- వృషభ రాశి: ఈ రాశి వారు ఆరోగ్యం లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాలు చూస్తారు. ఆదాయం మెరుగవుతుంది. చాల రోజులుగా ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాస్తులకి శ్రమ పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి ఫలించే సూచనలు ఉన్నాయి. వ్యాపార వర్గాలవారికి అనుకున్నంతగా రాబడి ఉండకపోవచ్చు.
- 2)మిథున రాశి: ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయట పడతారు, కష్టం మీద సకాలం లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ఆరోగ్యం కూడా చాల బాగుంటుంది. ఒక శుభకార్యానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. మీతోటి సహా ఉద్యోగులు కూడా మీకు బాగా సహకరిస్తారు. వ్యాపార వర్గాలవారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
- 3)కర్కాటక రాశి: వృత్తి, వ్యాపారాల్లో కష్టాలు తప్పవు, ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు,మశ్శాంతి ఉండదు. వ్యాపార వర్గాలవారికి ఇబ్బందులు తప్పవు.
Horoscope Today 15 July 2021:
- 4)సింహ రాశి: మిత్రులతో లేనిపోని అపార్థాలు రావొచ్చు, ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులనుంచి పూర్తి సహకారం లభిస్తుంది, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలోమరింత పురోగతి సాధిస్తారు.
- 5)కన్య రాశి: కొత్తవారితో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి, ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి ముప్పు లేదు. వ్యాపార రంగాల వారికి శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి.
- 6)తులా రాశి: రాజకీయ రంగాల వారికి సానుకూలంగా ఉంది, బంధు మిత్రులకి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
- 7)వృశ్చిక రాశి: పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూలంగా ఉంది. ఉద్యోగ రంగాల వారికి మీ శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. మీరనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చెయ్యకపోవడం ఉత్తమం.
- 8)ధనుస్సు రాశి: వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగాలవారికి ఆసానుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్త వహించడం చాల ముఖ్యం.
- 9)మకర రాశి: అనారోగ్యానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అతి కష్టం మీద పనులన్నీ పూర్తి చేస్తారు, వ్యాపార రంగాలవారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి,
- 10)కుంభ రాశి: రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా చాల బాగుంది. కోర్టు కేసుల్లో సానుకూల పవనాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు సాధిస్తారు. ఉద్యగం లో ఉన్నత అధికారుల నుంచి ప్రోత్సహం లభించే సూచనలు ఉన్నాయి.
- 11)మీనా రాశి : మీ ఆరోగ్యానికి, ఆదాయానికి ఎలాంటి లోటు లేదు. వ్యాపార రంగాలవారికి అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. బంధువులకి,స్నేహితులకి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారు.