తెలంగాణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే కూడా కూకట్ పల్లి నియోజకవర్గం పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవరం కృష్ణారావు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె టిడిపి క్యాండిడేట్ నందమూరి సుహాసినిపైన గెలుపొందారు. అప్పుడు మాధవరం కృష్ణారావుకు 111612 ఓట్లు రాగా నందమూరి సుహాసినికి 70563 ఓట్లు పడ్డాయి. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూకట్ పల్లి నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాహుల్ గాంధీతో కూడా ప్రచారం చేయించారు. అయినా కూడా ఫలితం అనుకున్నట్లుగా రాలేదు.
కూకట్పల్లి లో మరోసారి విజయం సాధించారు బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. ఈసారి ఆయన మెజార్టీ మరింత పెరిగింది. సెటిలర్స్ ఎక్కువమంది బిఆర్ఎస్ కే ఓటు వేసినట్లున్నారు. ఏకంగా 70,387 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పై విజయం సాధించారు.
ఇక బిజెపి మద్దతుతో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ కు 39,830 ఓట్లు పోల్ అయ్యాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ ఏకంగా ఎన్నికల్లోనే లేకుండా పోయింది.అయితే ఇక్కడ జనసేన బిజెపి పొత్తులో జనసేనపోటీ చేసింది. కూకట్ పల్లిలో అయితే ఏకంగా బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పవన్ కళ్యాణ్ ప్రచారానికి దిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. మిగిలిన స్థానాలతో పోలిస్తే కూకట్ పల్లి లో జనసేన కాస్త మెరుగనే చెప్పాలి.
కూకట్ పల్లిలో సెటిలర్స్ అందరూ కూడా జనసేనకి మద్దతు తెలుపుతారని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నంతగా మద్దతు అయితే రాలేదు. ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఒకవేళ జనసేన కాకుండా డైరెక్ట్ బిజెపిని పోటీ చేసి ఉంటే ఎన్నికల ఫలితాలు మార్పు వచ్చేదేమో అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి కి మంచి మెజార్టీ లభించింది.
Also Read:ఆ 8 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి? ఎన్ని ఓట్లు వచ్చాయంటే…?