‘బ్లాక్ బస్టర్’ అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న లావణ్య త్రిపాఠి .కానీ తాను చేసిన పొరపాటు ప్రారంభం లో వచ్చిన సినిమాలని అన్ని ఒకే చేయడం తో అపజయాలు వెంటాడాయి.దీనితో ఒక్కసారిగా వెనుకబడింది ఈ బ్యూటీ.మధ్యలో మళ్ళీ సక్సెస్ సాధించినా పెద్దగా కలిసిరాలేదు హిట్ సినిమా వచ్చి చాల రోజులు అయ్యింది…దీనితో నిరాశచెందాల్సి వచ్చింది..మొత్తానికి సురవరం సినిమాతో మళ్ళీ సక్సెస్ బాట పట్టింది.
ఈ బ్యూటీ ఇటీవలే ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు వెల్లడించారు. అవేంటంటే ‘ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నకు ఇంటి చుట్టూ పక్కల వారి సహాయంతో మాస్కులు చేస్తున్నానని,అవసరం అయిన వారికి అవి అందిస్తున్నామని తెలిపారు.ఇంట్లోనే వంట చేసి చుట్టూ పక్కల వారికి పంపిణి చేస్తునట్టు తెలిపింది వెబ్ సిరీస్ లు చేస్తూ మిగతా సమయాన్ని గడుపుతున్నారు తెలిపారు.నెట్ ఫ్లిక్ లో డార్క్ అనే వెబ్ సిరీస్ చూడాల్సిందిగా సలహా కూడా ఇచ్చారు.
ALSO READ : గీత గోవిందంని “అల్లు అర్జున్” అందుకే రిజెక్ట్ చేశాడా?
నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ “సోగ్గాడే చిన్ని నాయన” లో నటించ వద్దంటూ అందరూ హెచ్చరించారని తెలిపింది.సీనియర్ హీరో పక్కన చేస్తే మళ్ళీ అలాంటి పాత్రలే వస్తుంటాయి కెరీర్ దెబ్బ తింటుంది అంటూ అందరూ హెచ్చరించారని తెలిపింది.ఇదే విషయాన్ని నాగార్జున గారి వద్ద ప్రస్తావించగా అయన అన్ని వివరించి సినిమాకి ఒప్పించారని తెలిపిందిఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో..ఆ సినిమాలో లావణ్య చేసిన పాత్ర ఎంత హై లైట్ అయ్యిందో అందరికి తెలియనిది కాదు. అందుకే ఇప్పటికీ ముఖ్యమైన నిర్ణయాల్లో నాగార్జున గారి సలహాలు తీసుకుంటానని తెలిపారు.