సౌత్ ఇండియాలో చాలా మంచి మంచి నటులు ఉన్నారు. ఎటువంటి పాత్ర ఇచ్చిన సరే పరకాయి ప్రవేశం చేసి పాత్రను రక్తి కట్టించే నటులు చాలా మందే ఉన్నారు. అలాంటి నటులు మలయాళీ ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉంటారు. జోజు జార్జ్ కి మలయాళం లో మంచి క్రేజ్ ఉంది.భారీ పర్సనాలిటీ తో ఉండే ఆయనను చూస్తే ఏముంది స్పెషాలిటీ అనిపిస్తుంది.కానీ జార్జ్ నటించిన సినిమాలు చూస్తే ఆయనకు ఫ్యాన్స్ అయిపోతాం…
రాజశేఖర్ రీమేక్ చేసిన జోసెఫ్ సినిమా కానీ, కోటబొమ్మలి సినిమా ఒరిజినల్ మూవీ నాయట్టు కానీ, ఇరట్టు అనే సెన్సేషనల్ థ్రిలర్లో ఆయన నటన చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. తమిళ్ లో ధనుష్ నటించిన జగమేతంత్రం సినిమాలోజార్జ్ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది.
అయితే ఇలాంటి నటుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే చాలామంది ఫాన్స్ మంచి పాత్ర చేస్తున్నాడు అని అనుకున్నారంతా, కానీ తాజాగా రిలీజ్ అయిన ఆది కేశవ సినిమాలో జార్జ్ పాత్ర చూసిన ఎవరైనా సరే ఇలాంటి పాత్రకు జార్జ్ అవసరమా అనిపించక మానదు. జార్జ్ నటనను చూపించే ఒక్క సీను కూడా ఆది కేశవ సినిమాలో లేదు. దర్శకుడు శ్రీకాంత్ జార్జ్ ని తీసుకువచ్చి ఏదో మ్యాజిక్ చేస్తాడు అనుకుంటే చేసిందేమీ లేకుండా పోయింది. ఫ్యాన్స్ అందరూ నీరుగారి పోయారు. ఇలాంటి ప్రాముఖ్యత లేని పాత్రకి జార్జ్ అవసరమా ఆయన విలువ తగ్గించడం కాకపోతే అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
జార్జ్ కెరీర్ లో చేసిన అత్యంత లేకి పాత్ర ఈ సినిమాలోది అవుతుందని అంటున్నారు. ఆదికేశవ సినిమా మీద ముందు నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రొటీన్ కథతో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇంత స్టఫ్ ఉన్న నటుడికి ఇలాంటి పాత్ర ఇవ్వడమా అంటూ డైరెక్టర్ పైన విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి. అలాగే ఈ సినిమా వైష్ణవ తేజ్ కి బ్రేక్ వేసే లాగే కనిపిస్తుంది.మంచి పాత్ర ఇస్తేనే నటుడిలోని సత్తా అంతా బయటికి వస్తుంది కానీ మంచి నటుడిని తీసుకువచ్చి ఇలాంటి పాత్ర ఇస్తే ఆయన మట్టుకు చేసేదేముంటుందని సినీ విమర్శకులు అంటున్నారు.
Also Read:మంగళవారం సినిమా ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందో తెలుసా?