Shriya – Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి డెడికేషన్‌కు పెట్టింది పేరు. తన సినిమాలోని ప్రతీ సీన్ ని శిల్పాన్ని చెక్కినట్లుగా చెక్కుతాడు అందుకే జక్కన్న అని పిలుస్తారు. రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంతో పరితపిస్తుంటారు.
ఆయన సినిమా చూసేటప్పుడు స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశంలోను రాజమౌళి పడ్డ తపన, కష్టం కనిపిస్తుంది. జక్కన్న సినిమా కోసం ఎంతగా కష్టపడుతాడు అనే దానికి హీరోయిన్  శ్రియా చెప్పిన ఓ సంఘటన  సాక్ష్యంగా నిలుస్తోంది. హీరోయిన్ శ్రియా మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్  విషయాల గురించి తెలిపింది. RRR మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ, ‘RRR సినిమా మొదలు పెట్టకముందు రాజమౌళి గారికి ఆస్తమా వచ్చింది.
 అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ  తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్  చేసి సంచలనం నమోదు చేసింది.
 రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.

 అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్‌ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ  బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం.
 డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య  సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే  చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా  పూర్తి అయిన తరువాత  జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా  అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
 బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై  మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్  ఆగుతాయో  చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’  హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే  తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ  వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది.  అయితే ఇక్కడ  చెప్పేది  కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ  రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా  ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది  హోంబలే ఫిల్మ్స్.
అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.
ఇప్పటికే మహేష్‌బాబు,త్రివిక్రమ్‌ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్‌కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్‌బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఎస్ఎస్ఎంబీ29 గురించి ముఖ్యమైన  అప్డేట్ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో  అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్  అనిపించింది. ఈ సినిమాకి  మహేష్ బాబునే పర్ఫెక్ట్  ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్‌కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే  ఒక  అడ్వెంచరస్ సినిమా  అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను రాయబోతునట్లు  కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా  రాజమౌళి కూడా అదే  కథని  చెప్పాడు. యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్స్ అన్ని ఎస్ఎస్ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా  షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో  నటించబోయే నటీనటుల గురించిన  వివరాలు తెలియాల్సి  ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు.  అవన్నీ పూర్తయితే కానీ ఎస్ఎస్ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.
 హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా  వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ  సినిమా భారీ బడ్జెట్ తో  తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
 దర్శకుడు శేఖర్ కమ్ముల  స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి  నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో  థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.
నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద  మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే  చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా  ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్  హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.