పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సింది సినిమా డిసెంబర్ 22 కి పోస్ట్ పోన్ అయింది. షారుక్ ఖాన్ డంకి చిత్రానికి సలార్ పోటీగా వస్తుంది. డిసెంబర్ రిలీజ్ కావడంతో శరవేగంగా సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం సలార్ పార్ట్ 1 లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఉపయోగించారంట.సలార్ యాక్షన్స్ గురించి చిత్ర నిర్మాణం బృందం కొంత సమాచారాన్ని పంచుకుంది.
హాలీవుడ్ సినిమాలో లాగా భారీ యాక్షన్ సన్నివేశాలను సలార్ కోసం చిత్రీకరించారు. సినిమా కోసం భారీ యుద్ధ భూమిని నిర్మించారు. కేజిఎఫ్ సిరీస్ లో కనిపించిన విధంగా ప్రశాంత్ నీల్ అద్భుతమైన యాక్షన్స్ సన్నివేశాలను ఈ సినిమా కోసం రూపొందించి ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురి చేస్తారని అంటున్నారు.ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఆరు నెలల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు అంట. పార్ట్ 2 ని ఏప్రిల్ 2024లో విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. సలార్ పార్ట్ 1 విడుదలైన తర్వాత వెంటనే పార్ట్ 2 విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.
ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఖుషి ఇచ్చేది అవుతుంది. ఎప్పటినుండో సాలార్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ వెంటనే సలార్ పార్ట్ టు కూడా రానున్నడంతో సంబరాలు చేసుకుంటున్నారు.సాలార్ పార్ట్ వన్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేజిఎఫ్ ని సూపర్ హిట్ చేసిన డైరెక్టర్ అలాగే బాహుబలి వంటి సినిమాతో ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిన ప్రభాస్ హీరోగా వస్తుండడంతో ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read:సత్యం రాజేష్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!