భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.
ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా సరే ఆ స్థానం అంత సులభంగా రాదు. మధ్యలో కొన్ని ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎంతో మందికి స్పూర్తినిచ్చిన సక్సెస్ స్టోరీల్లో రతన్ టాటా గారిది కూడా ఒకటి.
ఎనభై నాలుగేళ్ళ వయసు, లక్షల కోట్లకి అధిపతి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రజ్యం.అయినప్పటికి ఎవరో చెప్పింది నేనెందుకు వినాలి అనే గర్వం లేదు. మన దేశంలో కోవిడ్ -19 ని అరికట్టడానికి 1500 కోట్లు ఇచ్చిన మహామనిషి అతను, దేశం కోసం నా యావదాస్తి రాసివ్వడానికైనా సిద్దం అని ప్రకటించిన మహానుభావుడు..
బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబంలో 1937 డిసెంబర్ 28 న జన్మించారు రతన్ టాటా. రతన్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూ. రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ దగ్గరే పెరిగారు. సిమ్లా, ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసి Cornell University నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లో టాటా స్టీల్ లో అప్రెంటిస్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.
Also Read >>>మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కన పెట్టి…కరోనాపై పోరుకు దిగిన భారత సంతతి డాక్టర్..!
1962లో టాటా స్టీల్ లో అప్రెంటిస్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రతన్ టాటా, 1991లో టాటా గ్రూప్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించారు . టాటా గ్రూప్స్ మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు 80దేశాలకు విస్తరించి,88 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ వ్యాపార విస్తరించడం వెనుక టాటా నిరంతర కృషి ఫలితమే. పదివేల కోట్ల సామ్రాజ్యాన్ని ఆరులక్షల కోట్లకి విస్తరించడంలో టాటా కృషి ఎంతో ఉంది .
స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కి దూరంగా ఉండే టాాటాకు రెండు జర్మన్ షెపర్డ్ డాగ్స్ అంటే చాలా ఇష్టం, అలాగే ఫాస్ట్ కార్స్ ని డ్రైవ్ చేయడం, జెట్స్ నడపటం, స్పీడ్ బోటింగ్ రేస్ లు తన హాబీలు. బాచలర్గా జీవితం గడుపుతున్న రతన్ టాటా ఇద్దరు అమ్మాయిలని దత్తత తీసుకున్నారు . బ్యాచిలర్‌గా గడపడం వెనుక ఒక కారణం ఉంది . తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, కానీ ఒక్కసారి కూడా అందులో విజయాన్ని అందుకోలేక పోయినట్టు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనస్సులోని మాటను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు . మూడు సార్లు ప్రేమలో పడి పెళ్లి వరకు వచ్చాక విఫలమయ్యాయనని, ఆ రోజుల్లో ఎందుకో ధైర్యం చేయలేకపోయానని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికి ప్రపంచ కుబేరుల లిస్టులో టాటా వారికి ఎందుకు స్థానం దక్కలేదా అనే ప్రశ్నకి సమాధానం వారు సంపాదించే దాంట్లో 60శాతం వరకు సేవాపనులకే వినియోగిస్తుంటారు. అంతేకాదు టాటా ఏ వ్యాపారం చేసినా దాని వలన తన లాభం కన్నా ప్రజలకు ఎంత వరకు లాభం అనేది ఆలోచిస్తారు. నానో కారు పుట్టిందే అలా.. లక్ష రూపాయలకు కారు అంటే మాటలా..కాని మధ్యతరగతి కుటుంబీకుల కల తీరాలని కోరుకున్నారు, తీర్చారు.
నిజానికి నానో కార్ల ఉత్పత్తి వలన టాటాకి వచ్చిన లాభం కంటే మిగిలిన నష్టమే ఎక్కువ అయినప్పటికి తన మనసు చెప్పిందే విన్నారు. ఆ కార్ల తయారి వెనుక ఒక కారణం ఉంది.ఒక రోజు కార్లో వెళ్తున్న టాటా కి ఒక సిగ్నల్ దగ్గర స్కూటి పై వెళ్తున్న ఒక కుటుంబం కనిపించిందట..ఇద్దరు పిల్లలు ,ఇద్దరు పెద్దవాళ్లు అంత చిన్న బండి మీద వెళ్లడం చూసిన టాటా ,ఎలా అయినా మధ్యతరగతి ప్రజల కల నెరవేర్చాలనుకున్నరు. నానో కారుని మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ఉప్పు నుండి సాఫ్ట్ వేర్ వరకు ఇలా ప్రతి రంగంలో తమ దంటూ ముద్ర వేసుకుని ముందుకు పోవడంలో రతన్ టాటాదే ప్రధాన పాత్ర. టాటా సంస్థ ద్వారా సుమారు 7లక్షల 6వేల మంది ఉపాది పొందుతున్నారు. తాము టాటా సంస్థలో పని చేస్తున్నాం అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారు..ఆ గర్వానికి కారణం టాటా.. రతన్ టాటా.. దేశంలో సామాన్యులు కూడా చేతులెత్తి మొక్కేది, కనపడేది సాష్టాంగ నమస్కారం చేయాలనుకునే వ్యక్తి రతన్ టాటా..
Also Read >>నేను అలా మాట్లాడలేదు…అది నిజం కాదు.! ఫేక్ వార్తపై స్పందించిన రతన్ టాటా.!